BREAKING
కొడిగేనహళ్లి-2 ఎంపీటీసీ స్థానానికి బీజేపీ తరఫున బంగారు చంద్ర నామినేషన్ పాలింపల్లి టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా వెంకటరమణ నాయక్ బూదవాడలో నేత్రదానం అభ్యర్థిని ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ కాకాణి గోవర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్ 'రామాయణ' సినిమాపై 12 ఏళ్ల క్రితమే జోస్యం.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన ఏఆర్ రెహమాన్! మనుబోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ ప్రస్థానం.. పెద్దల ఆశీస్సులతో ముందడుగు దిల్జిత్ దోసాంజ్ కన్సర్ట్ ముందు భారీ మోసం.. ఫ్యాన్స్‌ను హెచ్చరించిన పాపులర్ సింగర్! 21వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం – గౌరవ నాయకులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్యటన మక్కపేట ఎంపీటీసీ అభ్యర్థిగా బీఎస్పీ నుంచి గుడేటి అనిల్ కుమార్ నామినేషన్ ఇంకొల్లు-1 తెలుగుదేశం పార్టీ ఎం.పి.టి.సిగా మస్తాన్‌బాబా నామినేషన్‌ 'ది రాయల్స్' సీజన్ 2కు కొత్త దర్శకుడు.. తనుజ్ చోప్రా చేతికి ఇషాన్ ఖట్టర్ వెబ్ సిరీస్ బాధ్యతలు! నకరికల్లు ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు

రోడ్డు ప్రమాదంలో భవాని భక్తుల మృతి బాధాకరం! కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్

Select Suryaa Now
రోడ్డు ప్రమాదంలో భవాని భక్తుల మృతి బాధాకరం! కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్

భవానీ భక్తుల మృతి బాధాకరం

రావికంపాడు రోడ్డు ప్రమాదంపై ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో, కాకినాడ, అక్టోబరు 22: తుని మండలం రావికంపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు మృతి చెందడం తీవ్ర విషాదకరమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. దుర్ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దర్శనానికి కాలినడకన వెళ్లే భవానీ భక్తులు ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కోరారు.