డబ్బాకుపల్లి, పెంటేలవారిగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా పెంటేల స్వప్న నామినేషన్
వత్సవాయి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజు పలు గ్రామాలకు చెందిన ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ క్రమంలో డబ్బాకుపల్లి, పెంటేలవారిగూడెం ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న పెంటేల స్వప్న తన నామినేషన్ పత్రాలతో పాటు ఎన్నికల అఫిడవిట్‌ను ఎన్నికల అధికారికి సమర్పించారు.
కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన పెంటేల స్వప్నకు పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతుగా నిలిచారు. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఎన్నికల కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మండలంలో నామినేషన్ల దాఖలుతో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మరింత పెరిగింది.