ఆత్మకూరులో టీడీపీలోకి భారీగా చేరికలు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరులో శుక్రవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి సమక్షంలో పలువురు వైసీపీ ని వీడి తెలుగుదేశంలో చేరారు.
ఆత్మకూరు పట్టణంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, వైసీపీ నాయకుడు డాక్టర్ కే. వి. శ్రావణ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ మేకపాటి దీప్తి ఆనం సమక్షంలో వైసీపీ కి గుడ్ బై చెప్పి తెలుగుదేశంలో చేరారు.సంగం మాజీ సొసైటీ అధ్యక్షుడు పందిళ్లపల్లి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా టిడిపిలో చేరారు.
అనంతసాగరం మండలం వెంగంపల్లి వైసీపీ నాయకుడు నారాయణరెడ్డి తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు.
ఈ చేరికలు కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసం అని మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి పేర్కొన్నారు.ఆత్మకూరు పురపాలక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి రాజకీయ చేరికలు జోరందుకున్నాయి.
నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతుండటంతో ఆత్మకూరు రవితేజ కల్యాణ మండపంలోని ఎన్డీయే కూటమి కార్యాలయం పసుపు సందడి నెలకొంది.
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు కీలక నాయకులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఈ క్రమంలో సంగం మండల మాజీ సొసైటీ అధ్యక్షుడు, ప్రముఖ నాయకులు శ్రీ పందిళ్లపల్లి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఆత్మకూరు రవితేజ కల్యాణ మండపంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతసాగరం మండలం ఆమాని చిరువెళ్ల ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోని వెంగంపల్లికి చెందిన వైసీపీ ప్రముఖ నాయకుడు నారాయణరెడ్డి (ఎస్సన్నార్) తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక నాయకులు శ్రీహరిరెడ్డి, రఘునాథరెడ్డి సమన్వయంతో ఈ చేరికలు జరిగాయి.ఈ సందర్భంగా మంత్రి ఆనం నూతనంగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ప్రజల్లో విశ్వాసమే ఎన్డీయేకు పెరుగుతున్న మద్దతుకు కారణం అని మంత్రి ఆనం పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి, ఎన్డీయే కూటమికి ప్రజల నుంచి మద్దతు పెరుగుతోందని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది, ఎన్నికల సమయంలో ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేస్తుందనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించగలిగాం.
ఆ విశ్వాసంతోనే వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించేందుకు ముందుకు వస్తున్నారని మంత్రి తెలిపారు.నూతనంగా పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నామని, రాబోయే మున్సిపల్ ఎన్నికలతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఎన్డీయే కూటమి అభ్యర్థులకు పూర్తిస్థాయిలో మద్దతు అందించాలని ఈ ప్రాంత ప్రజానీకానికి మీడియా ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు ఆత్మకూరు పట్టణంలోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు సైతం తెలుగుదేశం పార్టీలో చేరడంతో రవితేజ కల్యాణ మండపం రాజకీయ సందడితో నిండిపోయింది.
ఈ కార్యక్రమంలో యువ నాయకుడు, మున్సిపల్ తెలుగుదేశం చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా తనయుడు బొమ్మిరెడ్డి తారక్ నాధ్ రెడ్డి,పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకులు తాళ్లూరు గిరినాయుడు, కాటంరెడ్డి రవీంద్రారెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం లీలా కైవల్యా రెడ్డి, మండల టిడిపి అధ్యక్షుడు సుంకర పెంచల చౌదరి, నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకుడు కేతా విజయభాస్కర్ రెడ్డి, ఆత్మకూరు మాజీ మండలాధ్యక్షుడు కేతా వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ కంచర్ల మాధవి, మండల తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఆత్మకూరు మండల జెడ్పిటిసి తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి,ఏ ఎం సి వైస్ చైర్మన్ గొట్టిగుండాల బుజ్జిరెడ్డి,సీనియర్ తెలుగుదేశం నాయకుడు చల్లా రవికుమార్ రెడ్డి,తెలుగుదేశంలో చేరిన సంగం పి ఏ సి ఎస్ మాజీ చైర్మన్ పందిళ్లపల్లి శివకుమార్ రెడ్డి,పట్టణ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి తోడేటి వెంకటయ్య,మాజీ కౌన్సిలర్లు సూరా భాస్కర్ రెడ్డి,పొడమేకల పెంచలయ్య యాదవ్, షేక్ రేష్మ,ఆత్మకూరు మున్సిపాలిటీకి కౌన్సిల్ అభ్యర్థులుగా తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు, తెలుగుదేశం క్లస్టర్ ఇంచార్జ్ లు తలచీరు బాబు నాయుడు, పి.సాగర్, బిజెపి సీనియర్ నాయకులు కుడుముల సుధాకర్ రెడ్డి, కరటంపాటి సుధాకర్,పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.