BREAKING
*సర్పంచ్‌ పై కాంగ్రెస్ నాయకుల దాడి.. ప్రజాస్వామ్యం పై దౌర్జన్యమా జిఎంఆర్* కాకాణి సమక్షంలో తెలుగుదేశంని వీడి వైఎస్ఆర్‌సీపీలో చేరిన 50 కుటుంబాలు శ్రీకాళహస్తి డివిజన్ లో నామినేషన్లు తిరస్కరణకు గురైతే అప్పీల్ చేసుకోండి ఆర్డిఓ భాను ప్రకాశ్ రెడ్డి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎంపీకి వినతిపత్రం పర్చూరు నియోజకవర్గంలో జడ్పీటీసీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేయాలి : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్ని ఎంపీటీసీ నామినేషన్లు ఆమోదం.. * 27 వరకు ఉపసంహరణ గడువు * ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జయమ్మ ప్రచారం ఎంఫార్మసీ, బీఫార్మసీ పేమెంట్ సీట్ల స్పాట్ అడ్మిషన్లు విదేశీ పెట్టుబడుల ఆంక్షల పెంపు నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ 40వ డివిజన్‌లో కోటంరెడ్డి లక్ష్మి హైందవి ఎన్నికల ప్రచారం రైతులకు భూ పరిహార చెక్కులు అందజేత నెల్లూరు రూరల్ ప్రచార పర్వంలో ఎంపీ వేమిరెడ్డి యోగా పోటీలకు ఎంపికైన శ్రీ సత్యసాయి విద్యా విహార్ విద్యార్థులు రష్యాలో ఘోర రోడ్డు ప్రమాదం...రైలు ఢీకొని ఆరుగురు దుర్మరణం సీఎంర్ఫ్ ద్వారా రూ. 1.56 లక్షల ఎల్ఓసీ అందజేత ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబ

జిల్లా ఎస్పీని సన్మానించిన యూనిక్ కంపెనీ బాధితులు

Select Suryaa Now
జిల్లా ఎస్పీని సన్మానించిన యూనిక్ కంపెనీ బాధితులు
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : యూనిక్ మర్చంటైల్ ఇండియా లిమిటెడ్, యూనిక్ ఎస్‌ఎంసీఎస్ సంస్థల పేరుతో పెట్టుబడులు, చిట్ ఫండ్స్ ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి దేశవ్యాప్తంగా 10000 మంది ప్రజల నుంచి భారీగా డబ్బులు సేకరించిన కేసులో ప్రధాన నిందితుడు గుజరాత్ అహ్మదాబాద్ కు చెందిన రాజ్ కుమార్ కైలాష్ రాయ్ (69)ను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో వివిధ జిల్లాలకు చెందిన సుమారు 150 మంది బాధితులు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను ప్రత్యేకంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, మెదక్, వరంగల్, కామారెడ్డి తదితర జిల్లాల నుంచి బాధితులు గురువారం రాత్రి ఆదిలాబాద్‌కు చేరుకుని ఎస్పీ కార్యాలయంలో ఆయనకు శాలువా కప్పి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. 
- దేశవ్యాప్తంగా వేలాది మంది బాధితులు : యూనిక్ సంస్థల పెట్టుబడి పథకాల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 10 వేల మంది ప్రజలు డబ్బులు పెట్టుబడిగా పెట్టి నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ బాధితులు ఉన్నట్లు సమాచారం. పెట్టుబడుల గడువు పూర్తయినప్పటికీ డబ్బులు తిరిగి అందకపోవడంతో అనేకమంది బాధితులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన నిందితుడి అరెస్ట్‌తో తమకు న్యాయం జరిగే అవకాశం ఉందని బాధితులు ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రజల నుంచి సేకరించిన డబ్బులు, సంస్థల ఆర్థిక లావాదేవీలు, నిందితులకు సంబంధించిన ఆస్తుల వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఇతర వ్యక్తుల పాత్ర, బాధితుల సంఖ్య, పెట్టుబడి మొత్తాలపై మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. భారీగా పెట్టబడులను సేకరించి వివిధ రాష్ట్రాలలో ఫైవ్ స్టార్ హోటల్స్ ను, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నందు 400 ప్లాట్లను 200 ఎకరాల స్థలాలను కొనుగోలు చేయడం జరిగిందని వాటిని కోర్టు ద్వారా జప్తు చేసేలా నివేదికలను పంపడం జరుగుతుందని తెలిపారు.పెట్టుబడి మోసం కేసులో బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమ ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్లలో నమోదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.  ప్రధాన నిందితుడి అరెస్ట్ నేపథ్యంలో బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జిల్లా ఎస్పీని సన్మానించడం ఈ కేసుపై బాధితుల్లో ఉన్న ఆశలను ప్రతిబింబించింది. బాధితుల ఫిర్యాదులు, అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా చట్టప్రకారం తదుపరి చర్యలు కొనసాగనున్నాయి.