BREAKING
గరివిడి లక్ష్మి బయోపిక్ కోసం ముందుగా ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్లను సంప్రదించారట.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు! 11వ రోజుకు చేరుకున్న జాతీయ ఆరోగ్య మిషిన్ కార్యకర్తల సమ్మె ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పని కల్పించాలి ఎంపిటిసి నామినేషన్ల సజావుగానే సాగింది జంగంపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి భక్త జనంతో పోటెత్తిన వాడపల్లి క్షేత్రం రావుపల్లి ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రావణి ప్రభాస్ బర్త్‌డే వేడుకల్లో ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్.. డార్లింగ్ పై ప్రత్యేక ప్రేమ! నాగిరెడ్డి పేటకు మహిళా సమైక్య భవనం మంజూరు ఏపీలో 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లకు ప్రత్యేక షెడ్యూల్ విడుదల సరాక పరిశ్రమ ప్రమాదంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం ఎండుతున్న వరి పంటలు విద్యార్థులకు కంటి పరీక్షలు బాలుడు వైద్యానికి రూ 25 వేలు సాయం

బంట్వారం వద్ద తీవ్ర విషాదం: మైనింగ్ క్వారీలో పడి కర్ణాటకకు చెందిన ఇద్దరు మృతి

Select Suryaa Now
బంట్వారం వద్ద తీవ్ర విషాదం: మైనింగ్ క్వారీలో పడి కర్ణాటకకు చెందిన ఇద్దరు మృతి

బంటారం, మేజర్ న్యూస్: వికారాబాద్  జిల్లా బంట్వారం మండల పరిధిలో శుక్రవారం నాడు తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని బొపునారం గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న ఒక మైనింగ్ క్వారీ నీటిలో పడి ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే చుట్టుపక్కల ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. మైనింగ్ క్వారీలు ఉన్న ప్రాంతంలో తగిన భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ దుర్ఘటనలో మరణించిన వారిని కర్ణాటక రాష్ట్రంలోని కుంచారం గ్రామానికి చెందిన వ్యక్తులుగా స్థానిక వర్గాలు ప్రాథమికంగా గుర్తించాయి. అయితే వారు ఈ ప్రాంతానికి ఏ పనిపై వచ్చారు, అసలు ఆ మైనింగ్ క్వారీ లోపలికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనే విషయాలపై ప్రస్తుతం స్పష్టత రాలేదు. సదరు వ్యక్తులు క్వారీ వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి పడ్డారా లేదా ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్వారీ లోతు ఎక్కువగా ఉండటంతో పాటు నీరు చేరి ఉండటంతో ప్రమా తీవ్రత పెరిగి ఉంటుందని భావిస్తున్నారు.ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే బొపునారం శివారులోని మైనింగ్ క్వారీ వద్దకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు చేపట్టిన పోలీసులు, వాటిని పంచనామా నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో సమగ్ర విచారణ ప్రారంభించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు కర్ణాటక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు వివరాలు విచారణ అనంతరం వెల్లడి కానున్నాయి.

రిపోర్టర్: శ్రీనివాస్ గౌడ్, బంటారం, వికారాబాద్ జిల్లా.