BREAKING
రైతులకు 8 బిలియన్ డాలర్ల డీజిల్ సాయం సమగ్ర భూసర్వేతో భూ సమస్యలకు పరిష్కారం: ఏడి మధుసూదన్ రావు బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్న జైలర్ 2.. కోట్లు కొల్లగొడుతున్న రజనీకాంత్ సినిమా! అమెరికాలో ఎఫ్‌టీసీ విచారణ ముగింపునకు భారీ జరిమానా నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన డి.ఎస్.పి రఘువీర్ అంతరిక్షంలో ఆయుధ పోటీకి చైనా వ్యతిరేకం ఇంకొల్లు మండల కాంగ్రేస్‌పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా కొల్లూరి శ్రీకాంత్‌ నామినేషన్ ఎంపీటీసీ స్థానానికి 55 నామినేషన్ లు! భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చైనా తొలి ఏఐ సినిమాకు నిరాశ.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో చుక్కెదురు! ఈనెల 25న మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితా. బ్యాంకు రుణాలు వ్యాపారాభివృద్ధికి వినియోగించాలి ​- కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు ఎంపీ మహేష్ కుమార్ తో ఎమ్మెల్యే బడేటి యూకేలో యూదుల వర్గాలపై దాడికి కుట్ర అనుమతి లేకుండా ప్రైవేట్ క్లినిక్ లు నడిపితే కఠిన చర్యలు సైదాపూర్‌ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత!

ఎండుతున్న వరి పంటలు

Select Suryaa Now
ఎండుతున్న వరి పంటలు

*--ఎల్‌నినో ప్రభావంతోబిబోర్లు బంద్‌.*

 *--విద్యుత్‌ సమస్య.. పశువులకు మేతగా మారుతున్న పంటలు* 

నవాబుపేట సూర్య న్యూస్:

మండలంలో ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వరి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దాదాపు మండలవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.సాగు చేసిన పంటలకు నీరందక పొలాలు ఎండిపోతుండటంతో పెట్టుబడులు కూడా చేతికి అందని పరిస్థితి ఏర్పడింది.కారుకొండ గ్రామానికి చెందిన రైతు గోపాల్‌ మూడు ఎకరాల్లో వరి సాగు చేయగా,భూగర్భ జలాలు పూర్తిగా పడిపోవడంతో బోరు పనిచేయడం లేదు.దీంతో రెండు ఎకరాల్లో వరి పంట పూర్తిగా ఎండిపోయింది.గత్యంతరం లేక ఎండిపోయిన పంటలో పశువులను మేపాల్సిన దుస్థితి ఏర్పడింది.పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట కళ్లముందే ఎండిపోవడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.మరోవైపు రుద్రారం గ్రామానికి చెందిన రైతు రామచంద్రయ్య నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాడు.ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గిపోవడం,దీనికి తోడు విద్యుత్‌ సమస్యలు ఎదురవడంతో పంటకు సరిపడా నీరు అందించలేకపోతున్నాడు. పంటను కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆవేదన చెందుతున్నాడు.పశువులకు మేతగా మారుతున్న పంటలు మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలు నీరందక ఎండిపోతున్నాయి.గత్యంతరం లేక రైతులు ఎండిపోయిన పంటల్లో పశువులను మేపుతూ బాధపడుతున్నారు.అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులకు పంట నష్టాలు తీవ్ర ఆర్థిక భారాన్ని మిగులుస్తున్నాయి.పచ్చని పొలాలు కళ్లముందే ఎండిపోవడం,పశువులకు మేతగా మారడం చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.ప్రభుత్వం ఆదుకోవాలి దాదాపు మండలవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో పంట నష్టాలను అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు.ఎండిపోయిన వరి పంటలకు నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.