BREAKING
అమెరికాలో హలోవీన్ వేడుకలు...భయానక ఉత్సాహంతో ప్రత్యేక ఏర్పాట్లు కళ్యాణదుర్గం ఎంపిడివో కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియలను పరిశీలించిన ఆర్టీవో వసంత బాబు. నార్పల జనసేన ZPTC అభ్యర్థిగా కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ నామినేషన్ ఎన్నికలకు మైక్రో అబ్జర్వర్లే కళ్లూ.. చెవులూ కళ్యాణదుర్గం ఎంపిటిఓ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియలను పరిశీలించిన ఆర్టీవో వసంత బాబు. అమెరికాలో మీజిల్స్ వ్యాధి...భారీగా పెరిగిన కేసులు, సీడీసీ హెచ్చరిక సిపిఎస్ ఎంప్లాయిస్ యూనియన్ మండల నూతన కమిటీ ఎన్నిక ప్రజాస్వామ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు గ్రామాల్లో ఈ-శ్రమ, టెలీ లా శిబిరాలు నిర్వహించాలి భారత్-యూకే వాణిజ్యాంబరానికి గండి...స్కాచ్ విచారణపై ట్రేడ్ బాడీ ఆందోళన రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కేనా? పూనూరు టిడిపి ఎంపీటీసీ రెబల్ అభ్యర్థిగా సాయి కార్తీక్. ఉక్రెయిన్ డిజిటల్ మౌలిక సదుపాయాలపై రష్యా ముప్పేట దాడి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లపై కలెక్టర్ పర్యవేక్షణ హర్షవర్ధన్ రాణె, సాదియా ఖతీబ్ లవ్ స్టోరీ 'సితా' విడుదల తేదీ ఖరారు.. థియేటర్లలోకి ఎప్పుడంటే?

పోలీస్ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం - జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

Select Suryaa Now
పోలీస్ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం  - జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

 సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు, శాఖ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించాలని సూచించారు. పోలీస్ విధులు, సేవలపై ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.

​

- ఆధునిక సాంకేతికత, సేవలపై సమగ్ర వివరణ

ప్రజల రక్షణ కోసం పోలీసులు నిర్వహించే పగలు, రాత్రి గస్తీ, పెట్రోలింగ్ విధానాలు, బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదు, దర్యాప్తు ప్రక్రియలను విద్యార్థులకు వివరించారు. నేరస్తులను గుర్తించేందుకు వినియోగిస్తున్న ముఖ గుర్తింపు వ్యవస్థ, చేతివేలి ముద్రల యంత్రాలు, సీసీ కెమెరాల ప్రాధాన్యతను తెలిపారు. మహిళలు, విద్యార్థినుల రక్షణకు పనిచేస్తున్న షీ టీమ్స్, భరోసా కేంద్రాల సేవలతో పాటు పోయిన మొబైల్ ఫోన్లను గుర్తించే సీఈఐఆర్ వ్యవస్థ విధానాన్ని వివరించారు. బాంబ్ స్క్వాడ్ పనితీరు, పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే పద్ధతి, పోలీస్ జాగిలాల సేవలను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించారు.

​

- ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ భద్రతపై సూచనలు

మైనర్ డ్రైవింగ్, మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఆన్‌లైన్‌లో అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

​ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు గణేష్, అనిల్, రంజిత్, ఆర్ఎస్ఐ సాయి కిరణ్, ఐటీ కోర్, భరోసా కేంద్రం, షీ టీమ్స్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.