BREAKING
బీసీలకు పెద్దపీట వేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాలింపల్లి టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా వెంకటరమణ నాయక్ బూదవాడలో నేత్రదానం అభ్యర్థిని ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ కాకాణి గోవర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్ 'రామాయణ' సినిమాపై 12 ఏళ్ల క్రితమే జోస్యం.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన ఏఆర్ రెహమాన్! మనుబోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ ప్రస్థానం.. పెద్దల ఆశీస్సులతో ముందడుగు దిల్జిత్ దోసాంజ్ కన్సర్ట్ ముందు భారీ మోసం.. ఫ్యాన్స్‌ను హెచ్చరించిన పాపులర్ సింగర్! 21వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం – గౌరవ నాయకులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్యటన మక్కపేట ఎంపీటీసీ అభ్యర్థిగా బీఎస్పీ నుంచి గుడేటి అనిల్ కుమార్ నామినేషన్ ఇంకొల్లు-1 తెలుగుదేశం పార్టీ ఎం.పి.టి.సిగా మస్తాన్‌బాబా నామినేషన్‌ 'ది రాయల్స్' సీజన్ 2కు కొత్త దర్శకుడు.. తనుజ్ చోప్రా చేతికి ఇషాన్ ఖట్టర్ వెబ్ సిరీస్ బాధ్యతలు! నకరికల్లు ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు

అర్హులకు సంక్షేమ పథకాలు.. అందరికీ అభివృద్ధి ఫలాలు..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఏడాది పాలనపై ప్రత్యేక కథనం

Select Suryaa Now
అర్హులకు సంక్షేమ పథకాలు.. అందరికీ అభివృద్ధి ఫలాలు..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఏడాది పాలనపై ప్రత్యేక కథనం

సూర్య రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. 2025 అక్టోబర్ 23న బాధ్యతలు స్వీకరించిన ఆమె.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందించడం, జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: అర్హులకు సొంతింటి కల సాకారం చేసేలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తున్నారు. ఏడాది కాలంలో 3 వేలకుపైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు.

విద్యారంగానికి ప్రాధాన్యం: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ విద్యార్థుల హాజరు, బోధన, ఆహార నాణ్యతను పరిశీలిస్తున్నారు. బాలికల వసతి గృహాల్లో సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు, ఫ్రీజర్లు, ఇన్సినిరేటర్లు, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించారు.

అంగన్వాడీల బలోపేతం: జిల్లాలోని 586 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మంగళవారం 10 నిమిషాలు కార్యక్రమంతో పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న 48 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించారు. 153 కేంద్రాల్లో పోషణ వాటికలు ఏర్పాటు చేశారు.

దివ్యాంగులు, వృద్ధులకు సహాయం: దివ్యాంగులకు అవసరమైన పరికరాల పంపిణీకి చర్యలు చేపట్టారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 16,631 మందికి రూ.2.93 కోట్ల విలువైన సహాయక పరికరాలు సమకూర్చారు. మండేపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమంలో తాగునీరు, సోలార్ విద్యుత్ సదుపాయాలు కల్పించారు.

వ్యవసాయంలో పంటల వైవిధ్యం: ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నారు. వరికి బదులుగా పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో 700 ఎకరాలకు పైగా కొత్తగా ఆయిల్‌పామ్ సాగు చేపట్టినట్లు నివేదికలో పేర్కొన్నారు.

రాజన్న ఆలయ అభివృద్ధి: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణం, 80 అడుగుల రహదారి పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. మహాశివరాత్రి జాతరను భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు వివిధ శాఖలను సమన్వయం చేశారు.

ముఖ్యమంత్రి పర్యటనలో అభివృద్ధి పనులు: సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా సిరిసిల్లలో నేతన్న బజార్‌, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం, పలు ప్రభుత్వ కార్యాలయాలు, గోదాముల నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిగాయి. పెద్దూరులో ఇందిరా మహిళా శక్తి భవనాన్ని ప్రారంభించారు.

ఎన్నికల నిర్వహణలో గుర్తింపు: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా పనిచేసిన సమయంలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గరిమ అగ్రవాల్ ఉత్తమ ఎన్నికల నిర్వహణ అవార్డు అందుకున్నారు. జిల్లాలో స్థానిక ఎన్నికల నిర్వహణలోనూ అధికారులను సమన్వయం చేశారు.

ఉపాధి హామీ పనుల్లో ముందంజ: గ్రామాల్లో ఉపాధి హామీ పనులు, శాశ్వత ఆస్తుల కల్పన, ప్రకృతి వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కూలీలకు విస్తృతంగా ఉపాధి కల్పించేలా గ్రామస్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్రంలో ఉపాధి కల్పనలో జిల్లా ముందంజలో నిలిచినట్లు నివేదిక పేర్కొంది.

గోదాముల నిర్మాణం: వేములవాడ అర్బన్ మండలం మారుపాకలో 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. రుద్రంగి, ఇల్లంతకుంట మండలాల్లోనూ గోదాముల నిర్మాణానికి చర్యలు చేపట్టారు.

వైద్య సేవల పర్యవేక్షణ: ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ వైద్య సేవలు, మందుల పంపిణీ, గర్భిణుల ఆరోగ్యంపై పర్యవేక్షణ చేస్తున్నారు. 2025 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ వైద్య సంస్థల్లో 3,344 ప్రసవాలు జరిగాయి. గర్భిణుల నమోదులో 95 శాతం లక్ష్యాన్ని సాధించారు. 421 మంది టీబీ బాధితులకు పోషకాహార కిట్లు అందించారు.

ఆరోగ్య పరిరక్షణ: ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే పాటించేలా చర్యలు తీసుకుంటూ డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పర్యాటక అభివృద్ధి: వేములవాడ గుడి చెరువు బండ్ పార్కును సుందరీకరించి మొక్కలు, విద్యుత్ దీపాలు, సప్తమాతృక విగ్రహాలు, 40 అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నాంపల్లి గుట్టపై యుద్ధ విమానాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వైభవాన్ని చాటేలా రగుడు జంక్షన్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

రోడ్డు భద్రత: రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రమాద ప్రాంతాల గుర్తింపు, రహదారుల మరమ్మతులు, సూచిక బోర్డుల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నారు.

మహిళా సంఘాలకు వసతులు: జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనాన్ని నిర్మించి ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 167 వీఓ భవనాల నిర్మాణాలు చేపట్టగా, 21 భవనాలు పూర్తయ్యాయి.

విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, పర్యాటకం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాల్లో సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది.