BREAKING
బుగ్గారం లో గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కూటమి జడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ క్యూ2 లాభాల్లో భారీ జంప్: మాదక ద్రవ్యాల ముఠాతో సంబంధం నీది కాదా?మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పై ఎమ్మెల్యే కొంబాబు నిప్పులు చెరిగారు! ఎంపీటీసీ జడ్పిటిసి నామినేషన్లు శాంతియుతంగా జరుగుతున్నాయి: ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు... సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుడు పండుగల సాయన్న కీర్తి సురేష్, రానా, రాధికా ఆప్టేల సందడి.. ఇండియన్ ఫిల్మ్ ప్రాజెక్ట్ సెలెబ్ లైనప్ ప్రకటన! పండుగ సాయన్న జీవితం సమానత్వానికి ప్రతీక - అదనపు ఎస్పీ పి. మౌనిక ప్రజాస్వామ్య వ్యవస్థలను స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం వైసీపీ నైజం : సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఏఐతో అర్థరాత్రి ఆసక్తికర సంభాషణ: క్లాడ్, చాట్‌జీపీటీలతో అనుభవాన్ని పంచుకున్న స్వామి సర్వప్రియోనంద! ఇజ్రాయెల్ రాజకీయాల్లో నెతన్యాహు ఓడిపోతే పాలస్తీనా విధానాలు మారుతాయా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన్మదిన వేడుకలు.. అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ సహా సినీ ప్రముఖుల శుభాకాంక్షలు! కలెక్టర్ ఫొటోతో డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి-నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా భీమగానిపల్లి టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా కొమ్మిరి సుధారాణి 2026 యూరోపియన్ యూనియన్ సఖరోవ్ అవార్డు సొంతం

యాసంగిలో ‘నీటి లభ్యత’ ఆధారంగానే రైతులు పంటల సాగు చేపట్టాలి : ఏఓ సుదర్శన్ గౌడ్

Select Suryaa Now
యాసంగిలో ‘నీటి లభ్యత’ ఆధారంగానే రైతులు పంటల సాగు చేపట్టాలి : ఏఓ సుదర్శన్ గౌడ్

కృష్ణ సూర్య న్యూస్ :
రాబోయే యాసంగి సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని, దానికి అనుగుణంగానే రైతన్నలు పంటల సాగు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి  సుదర్శన్ గౌడ్  పేర్కొన్నారు. ఖేత్ బచావో అభియాన్’ (సాగు భూమి సంరక్షణ) కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని చేగుంట రైతు వేదికలో సాగు భూముల సంరక్షణ, నేల ఆరోగ్య పరిరక్షణ మరియు పంటల మార్పిడి అంశాలపై రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. రాబోయే యాసంగి కాలంలో ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షపాతం, నీటి లభ్యతలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ, భూగర్భ జలాల లభ్యత మరియు విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసుకొని పంటల ఎంపికపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యాసంగిలో ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగును సాధ్యమైనంత వరకు తగ్గించాలని సూచించారు. తక్కువ నీటితో పండే శనగ, పెసర, మినుము వంటి పప్పుధాన్య పంటలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పంటల మార్పిడి వల్ల నేల సారం పెరగడమే కాకుండా నీటి వనరులను సమర్థవంతంగా వాడుకోవచ్చని వివరించారు. 
దీంతో తక్కువ నీటితో తక్కువ కాలంలో అధిక దిగుబడులు  రైతులు సాధించవచ్చన్నారు. 
అదేవిధంగా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సేంద్రియ పదార్థాల వినియోగాన్ని పెంచాలని, పంట వ్యర్థాలను నేలలోనే కలిపి దున్నాలని సూచించారు. భూసార పరీక్షల ఆధారంగానే తగిన ప్రమాణాల్లో ఎరువులను వాడాలని  ఆయన స్పష్టం చేశారు. స్థానిక వాతావరణం, నేల స్వభావం, నీటి వసతికి తగినట్లుగా రైతులు పంటల్లో వైవిధ్యీకరణ పాటించి సాగు ఖర్చు తగ్గించుకోవాలన్నారు.
కాబట్టి స్థిరమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతన్నలు ఆశించిన దిగుబడులు సాధించాలని మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్ కోరారు.
ఈ అవగాహన కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) సునీల్‌తో పాటు గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు పాల్గొన్నారు.

నర్సిములు, సూర్య రిపోర్టర్ కృష్ణ మండలం