BREAKING
ఆయుష్ శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దసరా సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం - ఎంఈఓ జాదవ్ మధుకర్ ఏడతెరపి లేని వర్షంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు 16వ వార్డులో కూటమి అభ్యర్థి మాధవి ఎన్నికల ప్రచారం. మాగాండ్లపల్లి టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా ఎం రత్నమ్మ ! కూటమి తరఫున ఎంపీటీసీ అభ్యర్థుల జాబితా ఆత్మకూరులో పటిష్టమైన బందోబస్తుతో నామినేషన్ల ప్రక్రియ- ఎస్సై జంపానీ కుమార్ తాటిపర్తి బిట్‌-1 ఎంపీటీసీ అభ్యర్థిగా ఉయ్యాల ప్రతాప్‌రెడ్డి నామినేషన్ అమరజీవి కొమరం భీం జయంతి సందర్భంగా వారసుల ఘన నివాళులు భక్తులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి నెక్కుంది టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా తలారి శ్రీదేవి ఆయుష్ శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే అంశంపై కేబినెట్ సబ్‌కమిటీ అధ్యయనం ప్రచారంలో రాధా దూకుడు ఘనంగా మాజీ మంత్రి కొడాలి నాని జన్మదిన వేడుకలు

మాదక ద్రవ్యాల ముఠాతో సంబంధం నీది కాదా?మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పై ఎమ్మెల్యే కొంబాబు నిప్పులు చెరిగారు!

Select Suryaa Now
మాదక ద్రవ్యాల ముఠాతో సంబంధం నీది కాదా?మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పై ఎమ్మెల్యే కొంబాబు నిప్పులు చెరిగారు!

 

 ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో కాకినాడ: 

అక్రమ వ్యాపారాలు, మాదకద్రవ్యాల దందాలతో కాకినాడ నగర పరువు తీసి, భావితరాల భవిష్యత్తును నాశనం చేసిన ఘనత గత వైకాపా పాలకులదేనని కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘డ్రగ్స్ మాఫియాతో లింకులు ఎవరివి?’

“విదేశాల్లో తిరిగానని, ఇంగ్లిష్ వచ్చని గొప్పలు చెప్పుకోవడం కాదు.. అక్కడి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు పెట్టుకుని యువతను నాశనం చేసేందుకు ప్రయత్నించింది ఎవరు?” అని కొండబాబు సూటిగా ప్రశ్నించారు. ద్వారంపూడికి ప్రధాన అనుచరుడిగా ఉన్న లోకల సత్యనారాయణ (సత్య) గత ఐదు నెలలుగా బ్యాంకాక్‌లో ఉంటూ డ్రగ్స్ తరలింపు వ్యవహారాలు నడిపిస్తూ అడ్డంగా దొరికిపోయాడని, ఆ యువకుడిని అక్కడికి పంపించింది ద్వారంపూడేనని ఆరోపించారు. ఒకవేళ అతడు దొరకకపోయి ఉంటే ఆ డ్రగ్స్ కాకినాడకే చేరేవని, గతంలో ముంద్రా పోర్టు వ్యవహారంలోనూ ఇక్కడి వ్యక్తుల పేర్లే బయటకు వచ్చాయని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా ‘ఈగల్ టీమ్స్’ ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపుతుండటంతోనే ఈ అక్రమాలు వెలుగుచూస్తున్నాయని స్పష్టం చేశారు.

‘ఇంట్లోనే పేకాట క్లబ్బులు.. తాతల కాలం నుంచీ అక్రమ మార్గాలే’

ద్వారంపూడి కుటుంబ చరిత్ర మొత్తం అక్రమ సంపాదనతోనే ముడిపడి ఉందని కొండబాబు విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు టౌన్ హాల్‌లోని అధికారుల క్లబ్‌ను మూయించేసి, తన ఇంట్లోనే పేకాట క్లబ్బు నడిపించిన చరిత్ర ద్వారంపూడిదని మండిపడ్డారు. “సినిమా హాళ్ల వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముకోవడం దగ్గర నుంచి.. నల్లమందు, దొంగ బియ్యం, దొంగ నోట్లు, నేడు డ్రగ్స్, గంజాయి వ్యాపారాల వరకు అడ్డదారిన కోట్లు గడించారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టకపోతే నువ్వు అసలు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యేవాడివా?” అని నిలదీశారు. సింహాచలం పాదయాత్ర వ్యవహారంలోనూ ఒక మహిళను నమ్మించి వంచించిన తీరును నగరం ఎప్పటికీ మర్చిపోదన్నారు.

‘భూములు, టిడ్కో ఇళ్లు, ₹500 కోట్ల టీడీఆర్ బాండ్లు’

గత ప్రభుత్వ హయాంలో కాకినాడను అన్ని రంగాల్లో సర్వనాశనం చేశారని కొండబాబు ఆరోపించారు. “మేము అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం 4,500 టిడ్కో ఇళ్లు మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తే.. వైకాపా ప్రభుత్వం వచ్చాక వాటిని పూర్తి చేయకపోగా, సమీపంలోని 10 ఎకరాల విలువైన స్థలాన్ని కబ్జా చేయడానికి చూశారు. అప్పట్లో మేం ప్రత్యక్షంగా వెళ్లి అడ్డుకుంటే తప్ప ఆ భూమి దక్కలేదు. నేడు ఆ భూమిని ఎంఎస్‌ఎంఈ పార్క్, ఎస్టీపీ ట్యాంకులు, పరిశ్రమలకు కేటాయించి ప్రజాప్రయోజనాలకు వాడుతున్నాం. అంతేకాకుండా, నగరంలో ఏకంగా ₹500 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి తెరలేపారు. మద్యం దుకాణాల వద్ద సిండికేట్లు పెట్టి దందా నడిపించారు. సర్పవరం జంక్షన్ నుంచి సంజయ్ నగర్, వాకలపూడి మీదుగా రహదారుల నిర్మాణం సహా వేల కోట్ల అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే” అని స్పష్టం చేశారు.

‘మాది కష్టార్జితం.. బహిరంగ చర్చకు సిద్ధమా?’

“మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు, భూముల రికార్డులు మా దగ్గర స్పష్టంగా ఉన్నాయి. 1998లో మంత్రి చిక్కాల రామచంద్రరావు హయాంలో తాళ్లరేవు-పటవల రోడ్డు కోసం మా కుటుంబం ఎకరంన్నర భూమిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ కోసం అవసరమైతే మాకున్న ఆస్తులు (మండపేట సైట్, ఏపీఎస్పీ స్థలాలు) అమ్ముకుని నిజాయతీగా రాజకీయం చేశామే తప్ప, ప్రజలను దోచుకోలేదు. ద్వారంపూడిలాగా దొంగ వ్యాపారాలు చేసి సంపాదించలేదు. దమ్ముంటే రికార్డులతో సహా బహిరంగ చర్చకు రావాలి” అని సవాల్ విసిరారు.

ఈ విలేకరుల సమావేశంలో తెదేపా నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.