తాటిపర్తి బిట్-1 ఎంపీటీసీ అభ్యర్థిగా ఉయ్యాల ప్రతాప్‌రెడ్డి నామినేషన్
పొదలకూరు, మేజర్ న్యూస్ : పొదలకూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కొనసాగుతోంది. మండలంలోని తాటిపర్తి బిట్-1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉయ్యాల ప్రతాప్‌రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. పొదలకూరు మండల జడ్పిటిసి అభ్యర్థి బచ్చల సురేష్ కుమార్ రెడ్డి(చిన్ని)పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నామినేషన్ కేంద్రానికి చేరుకున్న ఆయన ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు ఆయనకు మద్దతు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా సమష్టిగా కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.