BREAKING
నామినేషన్లు ప్రక్రియను పరిశీలించిన అబ్జర్వర్ ప్రశాంతి జూనియర్ కోహ్లి మాట తప్పాడు.. ఫోన్లు చేసినా రిప్లై లేదు: భారత మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు! 16 వ వార్డు లో వైసిపి జోరుగా ప్రచారం వింజమూరు జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా పందిటి అంబేద్కర్ మాదిగ నామినేషన్. భారత్ ఏ జట్టుతో సిరీస్‌కు బలమైన జట్టును ప్రకటించిన న్యూజిలాండ్.. పదకొండు మంది ఇంటర్నేషనల్ స్టార్లకు చోటు! రౌడీయిజం...బెదిరింపులు మా సంస్కృతి కాదు - ఎంఎల్‌ఏ డాక్టర్‌ పాశిం వైసిపి ఎంపీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రాజరాజేశ్వరి వావిలాల పిర్ష చెరువు కట్టపై ధ్వంసమైన సమాచార బోర్డు జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీలను, అభ్యర్థులను నిలదీయండి నాణ్యతా ప్రమాణాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి *వంగవీడు దగ్గర రూ.630 కోట్లతో జవహర్ ఎత్తిపోతల ప్రాజెక్టు* పెండింగ్‌ కేసుల పరిష్కారంలో వేగం పెంచాలి - మంచిర్యాల డీసీపీ న్యూజిలాండ్‌తో రెండో టీ20.. టీమిండియాలోకి యువ సంచలనం ఎంట్రీ! 49 వ వార్డు టిడిపి అభ్యర్థి పొట్నూరు నీలవేణి ఎన్నికల ప్రచారం స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం

ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే అంశంపై కేబినెట్ సబ్‌కమిటీ అధ్యయనం

Select Suryaa Now
ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే అంశంపై కేబినెట్ సబ్‌కమిటీ అధ్యయనం
హైదరాబాద్‌: ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏ గ్రూప్‌లోకి మార్చే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం (కేబినెట్ సబ్‌కమిటీ) సమగ్రంగా అధ్యయనం చేయనుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన 'పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి' వేడుకల్లో ఆయన ముఖ్య అతితిగా పాల్గొని పండుగ సాయన్న చిత్రపటానికి నివాళులర్పించారు.
 
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గతంలో ముదిరాజ్ కమ్యూనిటీని బీసీ-ఏ లోకి మార్చేందుకు సరైన లెక్కలు లేవన్న కారణంతో కోర్టులు తిరస్కరించాయని, అయితే ప్రభుత్వం నిర్వహించిన పక్కా కులగణన ఆధారంగా భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా కేబినెట్ సబ్‌కమిటీ అధ్యయనం చేస్తుందని తెలిపారు. న్యాయనిపుణులు, అధికారులతో చర్చించిన మీదట ముదిరాజ్‌లకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే ముదిరాజ్‌లను బీసీ-ఏ లో చేర్చడం వల్ల గంగపుత్రులకు అన్యాయం జరుగుతుందన్న అపోహలను తొలగించేందుకు ఆయా వర్గాలతో చర్చించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆదేశించారు.

నిరుపేదల కోసం పోరాడిన యోధులు పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్యల విగ్రహాలను ట్యాంక్ బండ్ పరిసరాల్లో ప్రతిష్టిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచిందని, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీలు ఈటల రాజేందర్, అనిల్ కుమార్ యాదవ్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.