BREAKING
ఎల్.కోటలో ముగిసిన నామినేషన్ల పర్వం.. మొత్తం 81 నామినేషన్లు 1న ఢిల్లీలో 10 వేల మందితో భారీ నిరసన: స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ నవంబర్‌ 1న నిర్వహణ డిండి ప్రాజెక్టు పేరుతో నల్గొండ కు నీరు తరలించే కుట్ర పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసులకు వ్యాసరచన పోటీలు జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇంటింటా ప్రచారం యాదగిరిగుట్ట దేవస్థానంలో దళిత వర్గాల ఉద్యోగులకు ప్రమోషన్ లు తక్షణమే ఇవ్వాలి ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా స్త్రీనిధి రుణాల రీపేమెంట్‌లో బాబురాజుకు రాష్ట్రస్థాయి ప్రథమ స్థానం…కరీంనగర్ జిల్లాకు ద్వితీయ స్థానం ధర్మవరం రూరల్ సీఐపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపణలు నిరాధారమే: పోలీసుల స్పష్టీకరణ గ్రామ గ్రామాన అభివృద్ధి.. గడపగడపకు సంక్షేమం స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు నెల్లిమర్ల జెడ్పీటీసీ స్థానానికి నలుగురు నామినేషన్లు దాఖలు మాగనూర్ నూతన ఎస్సైగా మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ నగరాభివృద్ధి ఘనత టిడిపిదే -స్థానిక ఎన్నికలను అడ్డుకునే కుట్ర వైసిపిదే -రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ నేను హీరోయిన్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇడుపు కాయితం వేడుకలో నాగదుర్గ భావోద్వేగం!

పెండింగ్‌ కేసుల పరిష్కారంలో వేగం పెంచాలి - మంచిర్యాల డీసీపీ

Select Suryaa Now
పెండింగ్‌ కేసుల పరిష్కారంలో వేగం పెంచాలి - మంచిర్యాల డీసీపీ
సూర్య నస్పూర్‌ : పెండింగ్‌ కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల డీసీపీ ఎ భాస్కర్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం శ్రీరాంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్‌ పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందుతున్న పోలీస్‌ సేవలను సమీక్షించారు. ఈ సందర్భంగా స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. రిసెప్షన్‌ కేంద్రాన్ని సందర్శించి ఫిర్యాదుల స్వీకరణ, రికార్డుల నిర్వహణ తీరును పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను శ్రద్ధగా విని చట్టప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు పోలీస్‌ సేవలు మరింత మెరుగ్గా అందేలా సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. స్టేషన్‌లో నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, పెండింగ్‌ కేసుల వివరాలను పరిశీలించిన డీసీపీ.. కేసుల పరిష్కారంలో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. వివిధ రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. స్టేషన్‌ రైటర్‌, సీసీటీఎన్‌ఎస్‌ రైటర్లతో మాట్లాడి కేసుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, రికార్డులను సక్రమంగా అప్‌లోడ్‌ చేయడం వంటి అంశాలపై ఆరా తీశారు. పోలీస్‌ స్టేషన్‌ నిర్వహణలో నిబంధనలు పాటిస్తూ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్‌ సీఐ  ఆకుల అశోక్‌, ఎస్‌ఐ సంతోష్‌, పోలీస్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.