తూంకుంట గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు..*
ఎల్నినో వర్షాభావ ప్రభావంపై ఏఈవో లోక రాజు సూచనలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆరుతడి పంటల సాగు మరియు నీటి కుంటల నిర్మాణమే శరణ్యమని వెల్లడి.
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల పరిధిలోని తూంకుంట గ్రామంలో ఎల్నినో వర్ష ప్రభావం మరియు వర్షాభావ పరిస్థితులపై రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తూంకుంట గ్రామానికి చెందిన వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ లోకరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టి, రైతులకు చేతిలో ఫ్లకార్డులు పట్టుకుని మరీ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయ సాగు పద్ధతులను పాటించాలని సూచించారు. భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో, తక్కువ నీటి వినియోగంతో పండే ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గుచూపాలని కోరారు. వర్షపు నీటిని వృథా చేయకుండా సంరక్షించుకునే దిశగా రైతులందరూ తమ పొలాల్లో నీటి కుంటల నిర్మాణాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కష్టకాలంలో రైతులు అధైర్యపడకుండా వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను సాగు చేయాలని అన్నారు. ఈ వినూత్న అవగాహన కార్యక్రమం గ్రామ రైతులకు ఎంతగానో ఉపయోగపడింది.
సూర్య రిపోర్టర్ వి అనంద రాజ్ ఐజ.మండలం