BREAKING
ఎల్.కోటలో ముగిసిన నామినేషన్ల పర్వం.. మొత్తం 81 నామినేషన్లు 1న ఢిల్లీలో 10 వేల మందితో భారీ నిరసన: స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ నవంబర్‌ 1న నిర్వహణ డిండి ప్రాజెక్టు పేరుతో నల్గొండ కు నీరు తరలించే కుట్ర పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసులకు వ్యాసరచన పోటీలు జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇంటింటా ప్రచారం యాదగిరిగుట్ట దేవస్థానంలో దళిత వర్గాల ఉద్యోగులకు ప్రమోషన్ లు తక్షణమే ఇవ్వాలి ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా స్త్రీనిధి రుణాల రీపేమెంట్‌లో బాబురాజుకు రాష్ట్రస్థాయి ప్రథమ స్థానం…కరీంనగర్ జిల్లాకు ద్వితీయ స్థానం ధర్మవరం రూరల్ సీఐపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపణలు నిరాధారమే: పోలీసుల స్పష్టీకరణ గ్రామ గ్రామాన అభివృద్ధి.. గడపగడపకు సంక్షేమం స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు నెల్లిమర్ల జెడ్పీటీసీ స్థానానికి నలుగురు నామినేషన్లు దాఖలు మాగనూర్ నూతన ఎస్సైగా మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ నగరాభివృద్ధి ఘనత టిడిపిదే -స్థానిక ఎన్నికలను అడ్డుకునే కుట్ర వైసిపిదే -రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ నేను హీరోయిన్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇడుపు కాయితం వేడుకలో నాగదుర్గ భావోద్వేగం!

వైసిపి ఎంపీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రాజరాజేశ్వరి

Select Suryaa Now
వైసిపి ఎంపీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రాజరాజేశ్వరి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంకడియం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ అభ్యర్థిగా తాడాల రాజరాజేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. కడియపులంక ఒకటవ వార్డు నుంచి ఎంపీపీ అభ్యర్థిగా ఆమె ఈ నెల 23న సంబంధిత అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు మద్దతు తెలిపారు.  

 అలాగే కడియపులంక మూడవ వార్డు ఎంపీటీసీ అభ్యర్థిగా తాడాల రాజరాజేశ్వరి భర్త, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల విష్ణు చక్రవర్తి కూడా నామినేషన్ దాఖలు చేశారు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. నామినేషన్ కేంద్రం వద్ద పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

తాడాల విష్ణు చక్రవర్తి రాజకీయాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. టీవీసీ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా, ఈశ్వర ఫామ్స్ అండ్ నర్సరీ అధినేతగా కొనసాగుతున్న ఆయన పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పేదలు, అవసరమైన కుటుంబాలకు సహాయం అందించడం, సామాజిక అవగాహన కార్యక్రమాలు చేపట్టడం వంటి కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజలకు చేరువయ్యారు.

రాజకీయ కార్యకలాపాలతో పాటు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో గుర్తింపు పొందిన విష్ణు చక్రవర్తి కుటుంబం నుంచి భార్యాభర్తలు ఇద్దరూ ఎన్నికల బరిలో నిలవడం కడియం మండల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. ఎంపీపీ అభ్యర్థిగా తాడాల రాజరాజేశ్వరి, ఎంపీటీసీ అభ్యర్థిగా తాడాల విష్ణు చక్రవర్తి తమకు ప్రజల మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉండే పాలనకు ప్రాధాన్యం ఇస్తామని వారు తెలిపారు.