యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి
యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి
-సిద్దిపేట ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపికృష్ణ
సిద్దిపేట రూరల్,మేజర్ న్యూస్: యాసంగి సీజన్‌లో వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుకు రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని సిద్దిపేట ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపికృష్ణ సూచించారు.శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చిన్నగుండవెల్లి గ్రామంలో ఏఓ నరేష్ నేతృత్వంలో నిర్వహించిన ‘ఖేత్ బచావో అభియాన్’ (సాగు భూమి సంరక్షణ కార్యక్రమం)లో ఆయన ముఖ్య అతిథిగాపాల్గొన్నారు.ఈ సందర్భంగా గోపికృష్ణ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున, యాసంగిలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. పంటల మార్పిడితో పాటు సాగునీటిని పొదుపుగా వినియోగిస్తూ వ్యవసాయం చేపట్టాలనిపేర్కొన్నారు.అనంతరం ఏఓ నరేష్ రైతులకు ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులు, వర్షపాత పరిస్థితులు, సమతుల్య ఎరువుల వినియోగం, పంటల వైవిధ్యీకరణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. భూసారాన్ని కాపాడుకుంటూ, అందుబాటులో ఉన్న వనరులకు అనుగుణంగా పంటలను సాగు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, జిల్లా ఆత్మ కమిటీ డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
(సూర్య రూరల్, రమేష్)