పాత గొడవలతో వ్యక్తిపై దాడి
నవాబుపేట సూర్య న్యూస్: గతంలో ఉన్న గొడవలను మనసులో పెట్టుకొని ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం చాకలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.ఎస్సై నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. చాకలపల్లి గ్రామానికి చెందిన తిరుమల సంతోష్ కుమార్ (26)ఈ నెల 20న దసరా పండుగ సందర్భంగా జమ్మి పూజకు వెళ్లేందుకు ఇంటి ముందు నిలబడి ఉన్నాడు.అదే సమయంలో గ్రామానికి చెందిన మేకల రఘు,భీమయ్య,అనురాధ,వెంకటయ్యలు అక్రమంగా అతని ఇంట్లోకి ప్రవేశించి దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు.దీంతో సంతోష్ కుమార్ భార్య కేకలు వేయడంతో సమీపంలో ఉన్న గట్టు శేఖర్,హరిజన్ కృష్ణ అక్కడికి చేరుకొని వారిని విడిపించారు.గతంలో సంతోష్ కుమార్‌కు సదరు వ్యక్తులతో గొడవలు ఉండగా,వాటిని మనసులో పెట్టుకొని దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ విషయాన్ని పెద్దల సమక్షంలో మాట్లాడుకుందామని ప్రయత్నించినా పరిష్కారం కాకపోవడంతో బాధితుడు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేందర్ తెలిపారు.