బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
కుకునూరుపల్లి,మేజర్ న్యూస్....మండల పరిధిలోని ముద్దపూర్ గ్రామానికి చెందిన రిప్పల గణేష్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మండల బిజెపి ప్రధాన కార్యదర్శి బోనాల రాజు తన అనుచరులతో కలిసి ఆ బాధ్యత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబ సభ్యులకు 5000 రూ. ఆర్థిక సాయం చేసి ఉదారతను చాటారు. భవిష్యత్తులో గణేష్ కుటుంబానికి అండదండలుగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొంతం కరుణాకర్ జిల్లా కౌన్సిల్ మెంబర్ గౌరారం కృష్ణ రెడ్డమైన లింగం నాగరాజు ఉప సర్పంచ్ విప్పల మహేష్ చింతల కర్ణాకర్ భువనగిరి చందు రాచకొండ సాయికిరణ్ రిప్పల శ్రావణ్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.