పొదలకూరు బిట్-1లో వైసీపీ అభ్యర్థి విస్తృత ప్రచారం
పొదలకూరు, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పొదలకూరు పంచాయతీ పరిధిలోని బిట్-1లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బిట్-1 ఎంపీటీసీ అభ్యర్థి గంగవరపు లక్ష్మీ కళ్యాణి గురువారం రమణారెడ్డి కాలనీలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓటర్లను కలిసి మద్దతు కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆశీస్సులతో ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. జడ్పీటీసీ అభ్యర్థి చిన్ని రెడ్డితో పాటు బిట్-1 ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు అంజాద్ బాషా, గంగవరపు వేణు, పముజుల శంకరయ్య, కాలంశెట్టి పెంచలయ్య, పగడాల బాలకృష్ణ, కార్యకర్తలు భాస్కర్‌రెడ్డి, రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.