ఎంపీ బలరాం నాయక్...కుంట ఎమ్మెల్యే లఖ్మా లను కలిసిన గురిజాల గోపి
మణుగూరు ఆర్ సి సూర్య; మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్,ఛత్తీస్ ఘడ్ మాజీమంత్రి, కుంట ఎమ్మెల్యే కవాసి లఖ్మా లను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురిజాల గోపి గురువారం మర్యాదపూర్వకంగా కలిసారు.సారపాక ఐ టి సి విశ్రాంతి భవనంలో సుమారు గంటన్నర సేపు పినపాక రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.ముందుగా ఇద్దరిని కలిసిన గురిజాల శాలువాలతో సన్మానించారు.పినపాక నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరు,సంక్షేమ పథకాల అమలుపై ముచ్చటించారు.అంతే కాకుండా మున్ముందు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలనే అంశాలపై చర్చించారు.
పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి సూర్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా