BREAKING
హర్షవర్ధన్ రాణె, సాదియా ఖతీబ్ లవ్ స్టోరీ 'సితా' విడుదల తేదీ ఖరారు.. థియేటర్లలోకి ఎప్పుడంటే? చంటి బిడ్డను ఎత్తుకొని వచ్చి నామినేషన్ దాఖలు చేసిన జడ్పిటిసి అభ్యర్థి మహాదేవి. ఉత్తరాఖండ్‌కు కళాకారులు రాకూడదనుకుంటున్నారా.. మంత్రి సుబోధ్ ఉనియాల్‌ను నిలదీసిన సింగర్ మికా సింగ్ లండన్ వెకేషన్‌లో అక్షయ్ కుమార్ కుమారుడితో అనన్య పాండే.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్ ఎన్నికల నిర్వహణపై రూట్, జోనల్ అధికారులతో సమావేశం మీ ముందుకు వస్తాను.. మీ సమస్యలు వింటాను.. వాటి పరిష్కారానికి కృషి చేస్తాను.. టైగర్ ష్రాఫ్ పై దాడి ఘటనపై అశోక్ పండిట్ సంచలన వ్యాఖ్యలు.. అందరికీ భద్రత సాధ్యం కాదంటూ స్పష్టీకరణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి 30 మద్యం సీసాలు స్వాధీనం ఐఫా 2027 వేదికపై సల్మాన్ ఖాన్ అల్లరి.. రష్మిక మందన్నాపై సెటైర్లు, వరుణ్ ధావన్‌తో చిలిపి డ్యాన్స్ మండలంలో 109 ఎంపిటిసి నామినేషన్లు బడ్జెట్ లోటు పూడ్చేందుకు ఇటలీలో ఇంధన సంస్థలపై ట్యాక్స్ పెంపునకు కసరత్తు ఏడవ వార్డులో తెదేపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం. ప్రమాద రహిత రంగారెడ్డే లక్ష్యం.. రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు 15 ఎంపీటీసీ స్థానాలకు 95 నామినేషన్లు

కూటమి జడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.

Select Suryaa Now
కూటమి  జడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.

జీలుగుమిల్లి: సూర్యపోలవరం నియోజకవర్గ పరిధిలోని జీలుగుమిల్లి మండలానికి సంబంధించి జడ్పీటీసీ, 9 ఎంపీటీసీ స్థానాలకు కూటమి అభ్యర్థులను పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ప్రకటించారు. గురువారం బర్రింకలపాడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనసేన జిల్లా నాయకులు గడ్డమణుగు రవికుమార్, జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులతో చర్చించిన అనంతరం అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.

జీలుగుమిల్లి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కుంజా నాగమణిని ప్రకటించారు. ఎంపీటీసీ అభ్యర్థుల్లో జీలుగుమిల్లి స్థానం నుంచి కారం సుజాతను ఎంపిక చేశారు. మండలంలోని మొత్తం తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలను ఖరారు చేసినట్లు ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. ఇందులో జనసేన పార్టీకి ఐదు స్థానాలు, తెలుగుదేశం పార్టీకి మూడు స్థానాలు, భారతీయ జనతా పార్టీకి ఒక స్థానం కేటాయించినట్లు పేర్కొన్నారు. కూటమి నాయకుల సమన్వయంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించారు.

ఎంపికైన అభ్యర్థులందరితో శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయించనున్నట్లు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. మండలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలను ప్రజలు గుర్తిస్తారని, రానున్న ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన, కూటమి నాయకులు బండారు అనిల్, గుడెల్లి లక్ష్మీనారాయణ, నాలి శ్రీనివాస్, పానుగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థుల ప్రకటనతో జీలుగుమిల్లి మండలంలో స్థానిక ఎన్నికల సందడి మొదలుకాగా, నామినేషన్ల దాఖలుతో ఎన్నికల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

రిపోర్టర్: బొంతు రామకృష్ణ, జీలుగుమిల్లి, ఏలూరు జిల్లా