BREAKING
తాటిపర్తి బిట్‌-1 ఎంపీటీసీ అభ్యర్థిగా ఉయ్యాల ప్రతాప్‌రెడ్డి నామినేషన్ అమరజీవి కొమరం భీం జయంతి సందర్భంగా వారసుల ఘన నివాళులు భక్తులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి నెక్కుంది టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా తలారి శ్రీదేవి ఆయుష్ శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే అంశంపై కేబినెట్ సబ్‌కమిటీ అధ్యయనం ప్రచారంలో రాధా దూకుడు ఘనంగా మాజీ మంత్రి కొడాలి నాని జన్మదిన వేడుకలు గుంటూరు: కూటమి మేయర్ అభ్యర్థికి మద్దతుగా మాజీ మంత్రి డొక్కా ఆత్మీయ సమావేశం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి సలీం గేదెదూడ మృతదేహాన్ని లాక్కెళ్లిన చిరుత పొదలకూరు బిట్‌-1లో వైసీపీ అభ్యర్థి విస్తృత ప్రచారం నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డిని కలిసిన విజయలక్ష్మి గునుకుల విజయవాడలో కారు బీభత్సం.. వాహనదారులపైకి దూసుకెళ్లిన వైనం జి.కొండూరు ఎంపీపీ అభ్యర్థిగా గెరా అనిత నామినేషన్

ప్రజాస్వామ్య వ్యవస్థలను స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం వైసీపీ నైజం : సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా

Select Suryaa Now
ప్రజాస్వామ్య వ్యవస్థలను స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం వైసీపీ నైజం : సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా

విజయవాడ సెంట్రల్, మేజర్ న్యూస్: ప్రజాస్వామ్య వ్యవస్థలను రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నైజంగా మార్చుకుందని టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఎన్నికల ప్రక్రియకు ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే సహించేది లేదని, ఎన్నికల కమిషన్, న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. గురువారం మొగల్రాజపురంలోని తన నివాసంలో సుప్రీంకోర్టు తీర్పుపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో న్యాయస్థానాల తీర్పులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించారని, కరోనా సమయంలో ఎన్నికలను వాయిదా వేసిన అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పట్ల వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, దౌర్జన్యాలకు పాల్పడడం, టీడీపీ నాయకులు, అభ్యర్థులకు చెందిన వాహనాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. 2020లో మాచర్ల సహా పలు ప్రాంతాల్లో జరిగిన ఘటనలను గుర్తుచేస్తూ, నామినేషన్ పత్రాలను చించివేయడం, అభ్యర్థులను బెదిరించడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. పుంగనూరు, తిరుపతి, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే, వాటికి అడ్డంకులు సృష్టించే విధంగా న్యాయపరమైన వివాదాలు తలెత్తడంపై వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల రాజకీయ, సామాజిక హక్కుల పరిరక్షణకు అన్ని పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ ద్వారా సుమారు 17 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో, న్యాయపరమైన వివాదాల కారణంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు ఆలస్యం కాకూడదని అన్నారు. అసెంబ్లీలో చర్చకు వచ్చిన అంశాలపై మంత్రి నారా లోకేష్ సమాధానాలు ఇచ్చారని, ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో అపోహలు సృష్టించడం సరికాదన్నారు. ఎన్నికల కమిషన్ సూచనలు, న్యాయస్థానాల ఆదేశాలను గౌరవిస్తూ చట్టబద్ధంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థుల వాహనాల ధ్వంసం, నామినేషన్ల సమయంలో అడ్డంకులు, అభ్యర్థులపై దాడులకు సంబంధించిన ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల యంత్రాంగం భద్రతా చర్యలు చేపట్టాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త నవనీత సాంబశివరావు, జనసేన సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ, వింజమూరి సతీష్, కాకొల్లు రవికుమార్ పాల్గొన్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.