చరిత్ర గర్వించదగ్గ వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్, పాలకుర్తిలో 174 జయంతి వేడుకలు
పాలకుర్తి, మేజర్ న్యూస్, చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వీరుడు పండుగ సాయన్న 174 వ జయంతి వేడుకలను గురువారం నియోజక వర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతిని పురస్కరిం చుకుని సాయన్న విగ్రహ ప్రతిష్ఠ కమిటీ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం విగ్రహ ప్రతిష్ఠకు శంకు స్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. మామిండ్ల సోమయ్య (ఎంఎస్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజికవర్గ ప్రతి నిధులు పాల్గొని పండుగ సాయన్న సేవలను, వీరత్వాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మామిండ్ల సోమయ్య మాట్లాడుతూ పండుగ సాయన్న కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదని,వారి జీవితం, పోరాట స్ఫూర్తి సమాజనికీ స్ఫూర్తి దాయకమని అన్నారు. చరిత్రలో పండుగ సాయన్నకు విశిష్టమైన స్థానం ఉందని, వారి వీరత్వాన్ని, సేవలను నేటి తరంతో భావి తరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. చరిత్రలో అనేక మంది వీరులు, ప్రజల కోసం పోరాడిన వ్యక్తులు కాలక్రమంలో తగిన గుర్తింపునకు నోచుకో లేదని, అలాంటి మహ నీయుల జీవితాలను వెలుగులోకి తీసుకు రావడం సమాజ బాధ్యతని తెలిపారు. పండుగ సాయన్న చరిత్రను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా వారి పోరాట స్ఫూర్తి ప్రజలకు తెలిపాలన్నారు. పాలకుర్తి కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్ఠ కోసం శంకుస్థాపన చేయడం ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టంగా నిలు స్తుందని, మహనీయు ల విగ్రహాలు కేవలం స్మారక చిహ్నాలుగా మాత్రమే కాకుండా, వారి జీవితాలను, ఆశయాలను, పోరా టాలను నిరంతరం గుర్తుచేసే స్ఫూర్తి కేంద్రాలుగా నిలు స్తాయని తెలిపారు. పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్ఠ ద్వారా వారి చరిత్రను ప్రజలకు తెలియచేయడంతో కొత్త తరానికి వారి గురించి తెలుసుకునే అవకాశం వచ్చింద న్నారు. ఈ కార్యక్రమం లో సొసైటీ అధ్యక్షుడు మామిండ్ల శ్రీనివాస్, కార్యదర్శి జీడి నిరం జన్, వార్డు సభ్యులు కవితశోభన్, దాసరి అనూష మధు, కత్తి దస్తగిరి, సొసైటీ మాజీ కార్యదర్శి మామిండ్ల యాకయ్య,,మామిండ్ల తప్ప యాకయ్య, జీడి మనోహర్, సోమేశ్వర్, సమ్మయ్య, ముద్దుల బోయిన నర సయ్య, మామిండ్ల సొమ్మల్లు, రేగుల కృష్ణ, అంబటి సోమయ్య, సేరు సమ్మయ్య, వెంకన్న, సోమయ్య,ఎల్లబోయిన ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : సోమయ్య, పాలకుర్తి ,జనగామ జిల్లా