BREAKING
తాటిపర్తి బిట్‌-1 ఎంపీటీసీ అభ్యర్థిగా ఉయ్యాల ప్రతాప్‌రెడ్డి నామినేషన్ అమరజీవి కొమరం భీం జయంతి సందర్భంగా వారసుల ఘన నివాళులు భక్తులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి నెక్కుంది టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా తలారి శ్రీదేవి ఆయుష్ శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే అంశంపై కేబినెట్ సబ్‌కమిటీ అధ్యయనం ప్రచారంలో రాధా దూకుడు ఘనంగా మాజీ మంత్రి కొడాలి నాని జన్మదిన వేడుకలు గుంటూరు: కూటమి మేయర్ అభ్యర్థికి మద్దతుగా మాజీ మంత్రి డొక్కా ఆత్మీయ సమావేశం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి సలీం గేదెదూడ మృతదేహాన్ని లాక్కెళ్లిన చిరుత పొదలకూరు బిట్‌-1లో వైసీపీ అభ్యర్థి విస్తృత ప్రచారం నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డిని కలిసిన విజయలక్ష్మి గునుకుల విజయవాడలో కారు బీభత్సం.. వాహనదారులపైకి దూసుకెళ్లిన వైనం జి.కొండూరు ఎంపీపీ అభ్యర్థిగా గెరా అనిత నామినేషన్

పండుగ సాయన్న జీవితం సమానత్వానికి ప్రతీక - అదనపు ఎస్పీ పి. మౌనిక

Select Suryaa Now
పండుగ సాయన్న జీవితం సమానత్వానికి ప్రతీక - అదనపు ఎస్పీ పి. మౌనిక
 
సూర్య, ఆదిలాబాద్‌ : తెలంగాణ చరిత్రలో ప్రజావీరుడు పండుగ సాయన్నకు ప్రత్యేక స్థానం ఉందని, ఆయన జీవితం సమానత్వం, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలుస్తుందని అదనపు ఎస్పీ పి. మౌనిక  అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పండుగ సాయన్న జయంతి వేడుకల్లో పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన పండుగ సాయన్న ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరించడం, ఆత్మగౌరవంతో జీవించడం, అణగారిన వర్గాలకు అండగా నిలవడం ఆయన జీవితంలోని ముఖ్యమైన విలువలన్నారు. సమాజంలో అసమానతలు తొలగి అందరికీ సమాన అవకాశాలు, గౌరవం లభించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.ప్రజల కోసం పోరాడిన మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేయాలని, వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు. సమాజంలో శాంతి, సామరస్యం, పరస్పర గౌరవం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ డి. వెంకటి, సీఐ నైలు, పోలీసు కార్యాలయ సూపరింటెండెంట్‌ సులోచన, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.