ఘనంగా పండుగసాయన జయంతి వేడుకలు
ఆత్మకూరు /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో గురువారం 174 పండుగ సాయన్న జయంతి వేడుకలను ముదిరాజ్ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పండుగ సాయన్న అని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారికంగా పండుగల సాయన్న జయంతి వేడుకలు జరిపినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం అధ్యక్షులు అశ్విని కుమార్, నాగరాజు, బుడ్డరాజు, గోవర్ధన్ ,బుచ్చన్న, పరుశురాం ,విజయ్ కుమార్ ,ఆనంద్, రమేష్, రఘు తదితరులు పాల్గొన్నారు.
_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.