శంషాబాద్‌లో యువకులపై దాడి కలకలం
జీహెచ్ఎంసీ శంషాబాద్ పరిధిలోని రాళ్లగడ్డ దొడ్డిలో దాడి ఘటన చోటుచేసుకుంది. పనుల కోసం వచ్చిన ఇద్దరు యువకులపై స్థానికుల గుంపుగా దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
అసలేం జరిగింది..?
పాతబస్తీకి చెందిన హైదర్, వాహెద్ అనే ఇద్దరు యువకులు ఎలక్ట్రీషియన్ పనుల కోసం శంషాబాద్‌లోని రాళ్లగడ్డ దొడ్డికి వెళ్లారు. అక్కడ వారిపై 20 నుంచి 25 మంది ఒక్కసారిగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
గాయపడిన బాధితులను వెంటనే హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
పోలీసుల తీరుపై ఆరోపణలు: దాడి జరిగిన తర్వాత తాము శంషాబాద్ పోలీసులను ఆశ్రయించినా, సకాలంలో స్పందించలేదని, కేసు నమోదు చేయడంలో జాప్యం చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఎంబీటీ నాయకుడి ఫిర్యాదు: ఈ ఘటనపై ఎంబీటీ నాయకుడు అంజదుల్లా ఖాన్ తీవ్రంగా స్పందించారు. బాధితులను ఆసుపత్రిలో పరామర్శించిన ఆయన, ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఉన్నత పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన ఆయన, నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఉన్న శంషాబాద్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
పోతుల నర్సింహా, మేజర్ స్యూస్ శంషాబాద్