BREAKING
ప్రజాస్వామ్య వ్యవస్థలను స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం వైసీపీ నైజం : సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఏఐతో అర్థరాత్రి ఆసక్తికర సంభాషణ: క్లాడ్, చాట్‌జీపీటీలతో అనుభవాన్ని పంచుకున్న స్వామి సర్వప్రియోనంద! ఇజ్రాయెల్ రాజకీయాల్లో నెతన్యాహు ఓడిపోతే పాలస్తీనా విధానాలు మారుతాయా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన్మదిన వేడుకలు.. అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ సహా సినీ ప్రముఖుల శుభాకాంక్షలు! కలెక్టర్ ఫొటోతో డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి-నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా భీమగానిపల్లి టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా కొమ్మిరి సుధారాణి 2026 యూరోపియన్ యూనియన్ సఖరోవ్ అవార్డు సొంతం ముడి చమురు ధరల సెగతో స్టాక్ మార్కెట్లలో నష్టాలు: సెన్సెక్స్, నిఫ్టీ 0.5% డౌన్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, నెస్లే డీలా! పేదల పక్షాన నిలిచిన ప్రజా వీరుడు పండుగ సాయన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థులు 3 వార్డుల్లో పోటీ--నంద్యాల పట్టణ కార్యదర్శి ప్రసాద్ అమెరికాలో వైట్ ఎవాంజెలికల్స్ మద్దతుపై ట్రంప్ పట్టు సడలినా చెక్కుచెదరని బలం రూ.31 కోట్లతో చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి కూటమి మేయర్ అభ్యర్థిరూప్ కుమార్ గారి తో విజయలక్ష్మి గునుకుల భేటీ! అండర్-19 మహిళల ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్ మ్యాచ్‌లు ఎప్పుడంటే? ఇటలీలో సద్దుమణుగుతున్న లారీ డ్రైవర్ల ఆందోళనలు

*కొమరం భీమ్ ఆశయాలు స్ఫూర్తిదాయకం*

Select Suryaa Now
 *కొమరం భీమ్ ఆశయాలు స్ఫూర్తిదాయకం*

*మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కొమరమ్ భీమ్ జయంతి వేడుకలు.*

మధిర.. సూర్య మేజర్ న్యూస్ 

మధిరలో స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గిరిజన వీరుడు కొమరం భీమ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమరం భీమ్ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పల్లపోతు ప్రసాదరావు, లింగంపల్లి అప్పారావు మాట్లాడుతూ, కొమరం భీమ్ తన జీవితాన్ని గిరిజనుల హక్కుల సాధన కోసం అంకితం చేసిన గొప్ప పోరాట యోధుడని పేర్కొన్నారు. “జల్, జంగల్, జమీన్” నినాదంతో గిరిజనుల హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. అన్యాయానికి ఎదురొడ్డి నిలిచి, తన జాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన కొమరం భీమ్ త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి, ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ, కొమరం భీమ్ సేవలనుకొనియాడారు. ఈ కార్యక్రమంలో పల్లపోతుల ప్రసాద్ శీలం శ్రీనివాసరెడ్డి చల్లా సత్యనారాయణ  ఇన్ స్టైల్ రాము గండూరి రాంబాబు గొల్లపల్లి శ్రీనివాస చారి వేమిరెడ్డి పిచ్చిరెడ్డి (ఫైర్) శాఖమూడి బ్రహ్మయ్య దాచేపల్లి రాము కొత్తూరు నరసింహారావు సముద్రాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.