క్యాన్సర్ బాధితునికి బిఆర్ఎస్ యువజన విభాగం ఆర్థిక సాయం
మణుగూరు ఆర్ సి సూర్య; పినపాక మాజీ శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు మండలం బొంబాయి కాలనీలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సత్యనారాయణకి వైద్య ఖర్చుల నిమిత్తం బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు గురువారం రూ 3 ల ఆర్థిక సాయం అందించారు.కార్యక్రమంలో జిల్లా యువజన నాయకులు పద్దం శ్రీనివాస్ స్థానిక నాయకులు మోస, మడి వీరన్న, సకిని బాబురావు,ఉప్పతల రామారావు, మండల యువజన అధ్యక్షులు భోశెట్టి రవిప్రసాద్, యువజన నాయకులు జక్కం రంజిత్, సూర్యం, భాను తదితరులు పాల్గొన్నారు.
పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా