BREAKING
నిర్మాణ రంగానికి కొత్త ఊపు: మార్కెట్లోకి మళ్లీ ‘వైజాగ్ టీఎంటీ’ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పనుల ప్రక్రియ వేగవంతం చేయాలి - కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ త్రివిధ దళాల సమన్వయంలో సీడీఎస్ కీలక భూమిక కె.ఎస్.పి.పి. ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న నితిన్ ఎ. గోఖలే ప్రజాపాలన కూటమితోనే సాధ్యం -47,48,49 డివిజన్ల ప్రచారంలో మైనార్టీలు బ్రహ్మరథం -మసీదు వద్ద మైనార్టీల కూటమికే సంపూర్ణ మద్దతు -ప్రచారంలో సైకిల్ స్పీడ్ పెంచిన మేయర్ అభ్యర్థి టీడీపీతోనే తిరుపతి అభివృద్ధి సాధ్యం : జేబీ శ్రీనివాస్ జనసేనలోకి వైసీపీ సీనియర్ నేత బత్తుల మల్లికార్జునరావు పది రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి -- నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి -- నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక అంతర్జాతీయ కరాటే పోటీల్లో కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాల విద్యార్థికి పసిడి పతకం బోడవారిపల్లి ఎంపీటీసీ బరిలో జనసేన అభ్యర్థి చిరంజీవి ఎల్‌నినోపై ముందస్తు చర్యల్లో ప్రభుత్వం విఫలం - తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ మాతృ మరణాలు సంభవించకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి... * జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు * పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు - సీపీ గౌష్ ఆలం ప్రత్యేక ప్రార్థనలు అయోడిన్ ప్రాముఖ్యంపై ప్రజలకు వివరించాలి... * జిల్లా వైశాధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు * గుండవోలు నుంచి స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థిగా తైదుపాటి నరసింహులు.... మోతె పాఠశాల గ్రంథాలయం ఆదర్శనీయం - పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ ఎన్నికల జోరు పెంచిన కోయిలాడ నవ్య

తుమ్మిడిహెట్టి, డిండి, అచ్చంపేట పనుల వేగవంతానికి ఆదేశాలు

Select Suryaa Now
తుమ్మిడిహెట్టి, డిండి, అచ్చంపేట పనుల వేగవంతానికి ఆదేశాలు
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. తుమ్మిడిహెట్టి, డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలపై అధికారులతో సమగ్రంగా చర్చించిన సీఎం, ప్రాజెక్టుల నిర్మాణ వేగాన్ని పెంచాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణంపై పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కావాలని, ఈ నెల 23వ తేదీ తర్వాత చర్చలకు పిలిచే అవకాశం ఉందని తెలిపారు. 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనల ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే డిండి ప్రాజెక్టుకు 0.5 టీఎంసీలు, అచ్చంపేట ఎత్తిపోతలకు 0.1 టీఎంసీల నీటిని కేటాయించాలని, ఏదుల రిజర్వాయర్‌కు అదనంగా 0.6 టీఎంసీల నీటిని తరలించేలా పంప్‌హౌస్‌లు, పంపుల పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.