BREAKING
నిర్మాణ రంగానికి కొత్త ఊపు: మార్కెట్లోకి మళ్లీ ‘వైజాగ్ టీఎంటీ’ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పనుల ప్రక్రియ వేగవంతం చేయాలి - కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ త్రివిధ దళాల సమన్వయంలో సీడీఎస్ కీలక భూమిక కె.ఎస్.పి.పి. ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న నితిన్ ఎ. గోఖలే ప్రజాపాలన కూటమితోనే సాధ్యం -47,48,49 డివిజన్ల ప్రచారంలో మైనార్టీలు బ్రహ్మరథం -మసీదు వద్ద మైనార్టీల కూటమికే సంపూర్ణ మద్దతు -ప్రచారంలో సైకిల్ స్పీడ్ పెంచిన మేయర్ అభ్యర్థి టీడీపీతోనే తిరుపతి అభివృద్ధి సాధ్యం : జేబీ శ్రీనివాస్ జనసేనలోకి వైసీపీ సీనియర్ నేత బత్తుల మల్లికార్జునరావు పది రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి -- నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి -- నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక అంతర్జాతీయ కరాటే పోటీల్లో కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాల విద్యార్థికి పసిడి పతకం బోడవారిపల్లి ఎంపీటీసీ బరిలో జనసేన అభ్యర్థి చిరంజీవి ఎల్‌నినోపై ముందస్తు చర్యల్లో ప్రభుత్వం విఫలం - తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ మాతృ మరణాలు సంభవించకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి... * జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు * పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు - సీపీ గౌష్ ఆలం ప్రత్యేక ప్రార్థనలు అయోడిన్ ప్రాముఖ్యంపై ప్రజలకు వివరించాలి... * జిల్లా వైశాధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు * గుండవోలు నుంచి స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థిగా తైదుపాటి నరసింహులు.... మోతె పాఠశాల గ్రంథాలయం ఆదర్శనీయం - పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ ఎన్నికల జోరు పెంచిన కోయిలాడ నవ్య

సొంతింటి కల నెరవేరే వరకు సీఐటీయూ పోరాటం ఆగదు - సీఐటీయూ కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి

Select Suryaa Now
సొంతింటి కల నెరవేరే వరకు సీఐటీయూ పోరాటం ఆగదు  - సీఐటీయూ కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి
సూర్య, మందమర్రి: సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కేకే-5 గనిపై కార్మికులను కలిసిన యూనియన్ కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ.. కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు, 12వ వేతన ఒప్పంద కమిటీ ఏర్పాటుపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మౌనం వీడాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. గతంలో సింగరేణికి రావాల్సిన బకాయిల సాధన కోసం ఏప్రిల్‌లో విద్యుత్ సౌధ వద్ద ధర్నా నిర్వహించి విద్యుత్ సంస్థలపై ఒత్తిడి తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇందిరాపార్క్ వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించారు. సింగరేణికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, దసరా సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సంస్థలో లేబర్ కోడ్‌లను అమలు చేయవద్దని ధర్నాలో ప్రధానంగా డిమాండ్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై సీఐటీయూ నిరంతరం పోరాడటం వల్లే సొంతింటి పథకంపై ప్రభుత్వం ప్రకటన చేసిందని అన్నారు. ప్రకటనతో సరిపెట్టకుండా పథకం కార్యరూపం దాల్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్మికులకు రావాల్సిన ప్రతి పైసా కోసం యూనియన్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. గతంలో సీఎంపీఎఫ్‌కు తక్కువగా జమ చేసిన వడ్డీని తిరిగి చెల్లించేలా పోరాడామని, ప్రస్తుతం ఆరు నెలలుగా సీఎంపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు వెల్లడించకపోవడంపై గోదావరిఖనిలోని కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి వినతిపత్రం అందజేశామని వివరించారు. 12వ వేతన ఒప్పంద కమిటీ ఏర్పాటుతో పాటు లేబర్ కోడ్‌ల సవరణ అంశంలోనూ కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కోల్ ఇండియా యాజమాన్యం లేఖ రాసినప్పటికీ, తెలంగాణకు చెందిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఇప్పటివరకు స్పందించకపోవడం విచారకరమన్నారు. గతంలో కార్మికులకు సంబంధించిన అంశాలపై అనుమతులు వచ్చినప్పుడు ఘనతను తమ ఖాతాలో వేసుకున్న రాజకీయ నాయకులు, ఇప్పుడు వేతన ఒప్పంద కమిటీ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు కార్మికుల సమస్యలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవద్దని, బొగ్గు పరిశ్రమను కాపాడే దిశగా పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో సింగరేణిలో జరిగే ఎన్నికల్లో కార్మికులు ప్రలోభాలకు లోనుకాకుండా తమ హక్కుల సాధనకు కృషి చేసే సంఘాలకు మద్దతు ఇవ్వాలని రాజారెడ్డి కోరారు. అనంతరం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను కార్మికుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ డిప్యూటీ జనరల్ సెక్రటరీ అల్లి రాజేందర్, బ్రాంచ్ అధ్యక్షులు ఎస్ వెంకటస్వామి, పిట్ సెక్రటరీ బద్రి ఆదర్శ్, బ్రాంచ్ ఉపాధ్యక్షులు లింగాల సత్యనారాయణ, పిట్ ఇన్‌చార్జి సంకె వెంకటేష్, పిట్ కమిటీ సభ్యులు చీకటి వంశీ, చైతన్య రెడ్డి, నవీన్, ప్రశాంత్, కలువల శ్రీనివాస్‌తో పాటు పలువురు గని కార్మికులు పాల్గొన్నారు.