సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట బి ఆర్ ఎస్ శ్రేణుల ఆందోళన
మణుగూరు ఆర్ సి సూర్య ;సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మణుగూరు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.మంచినీరు, వీధిలైట్లు, రోడ్లు మరమ్మత్తులు, పట్టణంలో చెత్త చెదారం తొలగించి పారిశుధ్యం పనులు ప్రతీ రోజు చేపట్టాలని డిమాండ్ చేశారు.మున్సిపాలిటీ లోని అనేక అంతర్గత వీధులు చెట్లతో మూసుకు పోయాయని తెలిపారు. ఇసుక లారీలతో ప్రధాన రహదారులు ధ్వంసం అవుతున్నాయన్నారు.బి ఆర్ ఎస్ హయాంలో ఇచ్చిన రూ75 కోట్ల నిధులు ఏమయ్యాయో తెలపాలన్నారు.
పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి సూర్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా