మాజీ సర్పంచ్ కొత్త రంగారెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పరామర్శ
చౌడాపూర్, మేజర్ న్యూస్ : చౌడాపూర్ మండలానికి చెందిన మాజీ సర్పంచ్ కొత్త రంగారెడ్డి సతీమణి కొత్త భారతమ్మ ఇటీవల మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందిస్తూ, భారతమ్మ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో చౌడాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాందాస్ నాయక్, తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్, చౌడాపూర్ మండల ఉపసర్పంచ్ బ్యాగరి రాజు, మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు జనార్దన్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, మఠం రాజశేఖర్, చాకలి యాదయ్య, మొగిలిగిద్ద దాసు, శివకుమార్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: కోస్గి విజయ్ కుమార్, చౌడాపూర్, వికారాబాద్ జిల్లా.