BREAKING
టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేత ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసిపి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు

బయోచార్ తో మహిళలకు ఉపాధి అవకాశాలు:డిఆర్డిఏ పి డి

Select Suryaa Now
బయోచార్ తో  మహిళలకు  ఉపాధి అవకాశాలు:డిఆర్డిఏ పి డి

అయినవిల్లి మేజర్ న్యూస్ : కొబ్బరి వ్యర్థాలను సంపదగా మార్చే బయో చార్ తో మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ డి రాంబాబు తెలిపారు. శుక్రవారం మండలంలోని నెదునూరు గ్రామంలో  కృషి వల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనని ఆయన సందర్చించారు. 

 జిల్లా కలెక్టర్  ఆదేశాలతో  వారు వివిధ రకాల ఉపాధి అవకాశాలను  డిఆర్డిఏ ద్వారా అనుసంధానం చేస్తున్నామన్నారు.  ప్రొడ్యూసర్ కంపెనీ వద్ద  మహిళలకు బయోచ్చార్ తయారీ మరియు కొబ్బరి పీచు పొట్టు అనుబంధ పరిశ్రమలు పై అవగాహన కల్పించారు. ఇటీవల సంభవించిన ఆర్నాబ్ తుఫాను కారణంగా ప్రతి గ్రామంలోనూ పడిపోయిన చెట్లను కొబ్బరి ఆకులు, కమ్మలు, డొక్కా డొలకలు, మొదలైన వాటిని బయో చార్ గా తయారు చేయవచ్చునని అలాగే కొబ్బరి డొక్కల నుండి పీచు అనుబంధ ఉత్పత్తులు పొట్టు అనుబంధం ఉత్పత్తులు తయారు చేసి విక్రయించి ఆర్థిక స్వావలంబన సాధించాలని తెలియజేశారు. 

 ఈ కార్యక్రమంలో అయినవిల్లి ఏపీఎం ఎమ్. వెంకటేశ్వరరావు  జీవనోపాదుల జిల్లా ఎ పి ఎమ్  డి.వరాల బాబు.కృషివల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్ శ్రీ గణపతి వీర రాఘవులు, సీఈవో అడ్డాల గోపాలకృష్ణ, డైరెక్టర్లు ముత్యాల జమీలు, ఉప్పుగంటి భాస్కర రావు, అడబాల రాజమోహన్ ప్రసాద్,రాజోలు ఏపీఎం డి. నాగమణి, CC లు భూపతి వర్మ, స్థానిక వి ఓ ఏ లు,   రైతులు, అనేక ప్రాంతాల నుండి మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.