BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

బస్ షెల్టర్లు అవసరాలను పట్టించుకోని పాలకులు

Select Suryaa Now
బస్ షెల్టర్లు అవసరాలను పట్టించుకోని పాలకులు

బస్ షెల్టర్లు అవసరాలను పట్టించుకోని పాలకులు --అవస్థల్లో ప్రయాణికులు ఆత్మకూరు, మేజర్ న్యూస్: ఆత్మకూరు ప్రాంతంలో అవసరమైన చోట్ల బస్ షెల్టర్లు లేక  కొన్నిచోట్ల అవసరం లేకున్నా రెండు నిర్మించి అవి అక్కరకు రాకుండా చేశారని, ఈ సమస్య గురించి ప్రయాణికులు ప్రజలు అరిచి గీ పెడుతున్న ఏ మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని పలు గ్రామాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు షెల్టర్ల నిర్మాణాలు విషయం ప్రభుత్వాలు కొంతకాలంగా గాలికి వదిలేసినట్లుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. నెల్లూరు ముంబై రహదారిపై నారంపేట బస్టాండ్ వద్ద అవసరం లేకున్నా రెండు బస్టాండ్లు నిర్మించారు. వెంకట్రావు పల్లి వద్ద గతంలో ఉన్న షెల్టర్ ను ఒక లారీ ఢీ కొనగా మరమ్మత్తులు చేయకుండా పూర్తిగా తొలగించారు. శాంతినగర్ వద్ద ఒక షెల్టర్ నిర్మించి దశాబ్దం దాటినా అందులోకి వెళ్లే దారి లేకుండా నిరుపయోగంగా  దర్శనమిస్తోంది. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై నెల్లూరు పాలెం సమీపంలో ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీ వద్ద నిత్యం విద్యార్థులు, సిబ్బంది షెల్టర్ లేక ఎండలో వానలో బస్సుల కోసం వేచి ఉంటుంటారు. నెల్లూరు పాలెం వద్ద బస్టాండ్ కు దూరంగా షెల్టర్లు నిర్మించగా అవి నిరుపయోగంగా ఉన్నాయి జాతీయ రహదారిపై ప్రముఖ యాత్ర స్థలం ఏ ఎస్ పేట కు వెళ్లే రోడ్ వద్ద ఒక షెల్టర్ నిర్మించాలని కోరుతున్నా పట్టించుకునేవారు లేరు. నువ్వూరుపాడు మజరా అంబేద్కర్ నగర వద్ద షెల్టర్ లేనందున ఒక చెట్టు జనాలకు షెల్టర్ గా ఉండగా వర్షాకాలం తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుంది. నాగులపాడు రోడ్డు కూడలి వద్ద బస్ షెల్టర్ లేక ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. అన్నింటికన్నా ప్రధానమైన ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఎదుట బస్ షెల్టర్ లేనందున ఎండలో వానలో రోగులు, వారి బంధువులు, హాస్పిటల్ సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. గతంలో ఒక ట్రస్ట్ వారు చిన్నపాటి షెల్టర్ నిర్మించగా ఎవరో తొలగించారు. ఇటీవల తీవ్రమైన ఎండల్లో నిత్య అన్నదాత కంచి పరమేశ్వర్ రెడ్డి అక్కడ ఒక చలివేంద్రం ఏర్పాటు చేసి ఒక పందిరి వేసి బెంచీలు ఏర్పాటు చేయగా వాటిని జనాలు షెల్టరుగా వినియోగించుకుంటున్నారు. జనాలు అవస్థలు అసౌకర్యాలను  ఇప్పటికైనా అధికారులు కానీ పాలకులు గాని పట్టించుకుని బస్ షెల్టర్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సర్వత్రా కోరుతున్నారు.