BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

బాపట్ల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి

Select Suryaa Now
బాపట్ల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలి :  జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి

బాపట్ల, మేజర్‌న్యూస్‌  :

 ఈ నెల 30న (సోమవారం) బాపట్ల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్,వి.,పేర్కొన్నారు. ఈ నెల 30న (సోమవారం) బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి  ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం స్థానిక బాపట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేపడుతున్న ఏర్పాట్లను శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి   పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ఈ నెల 30న (సోమవారం) బాపట్ల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.   ఓట్ల లెక్కింపు కేంద్రంలో చేపడుతున్న ఏర్పాట్లు, కౌంటింగ్ హాళ్లలో మౌలిక సదుపాయాలు, అభ్యర్థులు మరియు వారి ఏజెంట్లకు కల్పించాల్సిన వసతులు, తాగునీరు, ఇతర అవసరమైన సౌకర్యాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులు, వారి ఏజెంట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అదేవిధంగా ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే అనుమతించాలని,  సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ ఏ. హరికుమార్, డీఆర్డీఏ పీడీ మరియు రిటర్నింగ్ అధికారి బి. సింగయ్య, మున్సిపల్ కమిషనర్ ఎం. హాసిని, డీఈ కృష్ణారెడ్డి, ఆర్ అండ్ బీ, డీఈ అరుణ, తహశీల్దార్ షేక్ సలీమా,మండల సర్వేయర్ తదితరులు ఉన్నారు.