BREAKING
మోమిన్‌పేట్ రైతు వేదికలో ఎల్‌నినో ప్రభావంపై సమీక్ష.. వీక్షించిన రైతులు టీఎన్జీవో సభ్యత్వ నమోదులో 55 మంది ఉద్యోగులు పి.ఎం. రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స - రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు 21 వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ ప్రచారం జోరు ఇంకొల్లు మండలంలో 67 నామినేషన్లు ఆమోదం సాయిపూర్‌లో ఆంజనేయ స్వామి ఉత్సవం అంగరంగ వైభవం 11వ వార్డు లో జోరుగా ఎన్నికల ప్రచారం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కలను సాకారం చేస్తాం : సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయోడిన్ పై విద్యార్థులకు అవగాహన భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి - రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు పొదలకూరులో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన.. అప్రమత్తంగా ఉండాలి ఎన్.హెచ్.ఏం ఉద్యోగుల 12వ రోజు రిలే దీక్షలకు రిటైర్డు ఉద్యోగ సంఘం నాయకుల మద్దతు సుమ ప్రయాణంపై రాజీవ్ కనకాల భావోద్వేగ వ్యాఖ్యలు: ఆమెకు మేమెప్పుడూ సపోర్ట్ చేయలేదు చేర్యాల పట్టణంలో కాంగ్రెస్ 9వ వార్డు కమిటీ ఎన్నిక

బాడంగిలో 60 నామినేషన్లూ చెల్లుబాటు

Select Suryaa Now
బాడంగిలో 60 నామినేషన్లూ చెల్లుబాటు

బాడంగి, సూర్య : బాడంగి మండల ప్రజా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శనివారం ముగిసింది. మండలంలో మొత్తం 60 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన అనంతరం అన్నీ చెల్లుబాటు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కే. మహారాజన్‌ ఆధ్వర్యంలో అధికారులు అభ్యర్థులు సమర్పించిన నామినేషన్‌ పత్రాలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి నామినేషన్‌ తిరస్కరణకు గురికాకపోవడంతో మొత్తం 60 నామినేషన్లూ ఆమోదం పొందాయి. ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారులైన తహసీల్దార్‌ కే. వరప్రసాద్‌, ఎంపీడీవో డి.వి. శ్రీలత, సిబ్బంది ప్రధాన ఉపాధ్యాయులు జి. జీవరత్నం తదితరులు పాల్గొన్నారు. 

ఎన్నికల షెడ్యూల్‌ ఇలా.. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. నవంబరు 3న పోలింగ్‌ నిర్వహించనుండగా, నవంబరు 5న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

రిపోర్టర్ : శ్రీనివాసరావు, బాడంగి, విజయనగరం జిల్లా.