అశ్వారావుపాలెంలో నూతన పార్క్ ప్రారంభం.. మండలి వెంకట కృష్ణారావు విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం
అవనిగడ్డ, మేజర్ న్యూస్: మండల పరిధిలోని అశ్వారావుపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ పార్క్ ప్రారంభోత్సవం, దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామ మాజీ సర్పంచ్ పండ్రాజు లంకమ్మ ప్రసాద్ ఆధ్వర్యంలో పార్క్‌తో పాటు మండలి వెంకట కృష్ణారావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రేపు మంగళవారం జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ, ఏపీ గ్రీన్ బోర్డు చైర్మన్ కొణిదెల నాగబాబు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హాజరై ప్రారంభించనున్నట్లు లంకమ్మ ప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం యువనాయకుడు మండలి వెంకట్రామ్ ఏర్పాట్లను పరిశీలించారు.కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గుడివాక శేషుబాబు, మాజీ ఎంపీటీసీ బొప్పన భాను, సొసైటీ చైర్మన్ యలవర్తి చిన్నా, గుడివాక శివరావు పాల్గొన్నారు.✍️ అజంతా శ్రీనివాస్,
అవనిగడ్డ, కృష్ణాజిల్లా.