BREAKING
20 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..:ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. వట్టిపల్లి మండల ఏర్పాటు వెనుక, కాంగ్రెస్ నాయకుల పోరాటం కీలకం. జేడీ చక్రవర్తికి అంతర్జాతీయ గౌరవం.. 'దాహిణీ: ది విచ్' మూవీకి బెస్ట్ యాక్టర్ అవార్డ్ సొంతం! వైభవంగా వేపచెట్టు కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీ గుజ్జ సత్యానికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించాలి సత్యదేవ్, ఫరియా 'ట్రయల్ అండ్ ఎర్రర్'.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం! ఫిర్యాదు పరిష్కారమైతే సరిపోదు.. ప్రజలు సంతృప్తి చెందాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పోలింగ్ కేంద్రాలు పరిశీలిస్తున్న శ్రీకాళహస్తి డిఎస్పి వరుణ్ సందేశ్ ‘కాస్ట్’ టీజర్ విడుదల.. హింసాత్మక, తీవ్రమైన డ్రామాగా సరికొత్త చిత్రం! పోలీసుల వేధింపులు తాళలేక… ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ పై నుంచి దూకిన వ్యక్తి విజయదుర్గమ్మ వారి దేవి నవరాత్రుల ఉత్సవాలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై స్పష్టతనివ్వాలి రాయదుర్గం కాంగ్రెస్‌లో భారీ చేరికలు గౌని ప్రతాపరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన 26 కుటుంబాలు కాట్రేనికోనలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన.. వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు..

అన్నవరప్పాడు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్

Select Suryaa Now
అన్నవరప్పాడు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్

పునర్నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మేజర్ న్యూస్ :

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ అక్టోబర్ 10వ తేదీ శనివారం పరిశీలించారు.ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాలపై ఇంజనీరింగ్, సాంకేతిక అధికారులతో చర్చించారు.కమిషనర్ వెంట రాజమహేంద్రవరం ప్రాంతీయ సంయుక్త కమిషనర్ వేండ్ర త్రినాథరావు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఈ.వి. సుబ్బారావు, సాంకేతిక సలహాదారు ఎస్. సుబ్బారావు, పర్యవేక్షక ఇంజనీర్ తోట దుర్గేష్, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు ఉదయ్ కుమార్, శ్రీనివాస్, ఉపస్థపతి సతీష్ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.