అనంత రూరల్ లో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు సర్వం సిద్ధం
నేడే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు
-సర్వం సిద్ధం చేసిన అధికారులు
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా.. అనంతపురం రూరల్ మండలంలో గురువారం ఎంపీటీసీ, జడ్పిటిసి పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పోలింగ్ డ్యూటీ సిబ్బంది, పోలీసులు బుధవారం సాయంత్రానికి.. కేటాయించిన పోలింగ్ బూత్ లకు చేరుకున్నారు. రూరల్ , అర్బన్ మండలంలో 25 గ్రామ పంచాయతీలలో.. 137 పోలింగ్ బూత్ లను.. ఏర్పాటు చేసినట్లు ఆర్వో నారాయణస్వామి, అసిస్టెంట్ ఆర్వో దివాకర్ తెలిపారు. మండలంలో
మొత్తం 1,28,000 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అన్ని పోలింగ్ బూత్ లో గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 ఐదు గంటల వరకు.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు తెలియజేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, నలుగురు ఇతర పోలింగ్ అధికారులు ఉంటారని తెలిపారు. 800 మంది పోలీస్ సిబ్బందితో
పోలింగ్ కేంద్రాల వద్ద .. పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు .. ఎన్నికల నియమావళిని పాటించి... ఎలాంటి గొడవలు జరగకుండా... ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని.. ఎన్నికల అధికారులు కోరారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు తెలిపారు.