అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు 12 వేలు ఆర్థిక సహాయం
కనిగిరి ,మేజర్ న్యూస్ :కనిగిరి మండలం
గార్లపేటకు చెందిన తాళ్లపల్లి మాల్యాద్రి గుండెపోటుతో మృతి చెందగా ఆయన భార్య శ్రీలక్ష్మి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. వీరికి చదువుకుంటున్న ఇద్దరు కుమార్తెలు ఉండగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్న కనిగిరి మానవతా శాఖ సభ్యులు, దాతల సహకారంతో తొలుత రూ. 30,500/- ఆర్థిక సహాయం అందించారు.అనంతరం బాధిత కుటుంబ పరిస్థితిని చూసి స్పందించిన దాతలు మరో రూ. 12 వేలు అందించగా, మానవతా కమిటీ సభ్యులు, ప్రధాన దాత మణికంఠ మోహన్ కుమార్తె శ్రావణి సహకారంతో ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వాగిచర్ల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ కే. బాబురావు, కన్వీనర్ మాంటిస్సోరి పిచ్చిరెడ్డి, ప్రెసిడెంట్ పచ్చవ చంద్రశేఖర్, కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్లు బొగ్గరపు శ్రీనివాసు, తాళ్లూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన దాతలందరికీ, సహకరించిన మానవతా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు .