అందరినీ కలుపుకొని వెళ్తే వైసీపీ గెలుపు సాధ్యం..
ఎమ్మిగనూరు, సూర్యప్రతినిధి
రాజకీయాలలో ఒంటెద్దు పోకడ పోకుండా అందరినీ కలుపుకొని ముందుకు పోతే స్థానిక సంస్థల్లో వైకాపా విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర రైతు సంఘం అధికార ప్రతినిధి గడ్డం నారాయణరెడ్డి ఎమ్మిగనూరు వైకాపా సమన్వయకర్త రాజీవ్ రెడ్డికి మీడియా పరంగా సూచించారు. స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన నజీర్ అహమ్మద్ కు పార్టీ బీఫామ్ ఇచ్చి ఎన్నికల బరిలో దింపి ఉంటే నష్టం ఏమీ జరిగేది అన్నారు. వైకాపా ఇన్చార్జిగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో టిడిపి చైర్మన్ అభ్యర్థిని పొగడటం లో ఆంతర్యం ఏముందన్నారు. మన చైర్మన్ అభ్యర్థి కె ఎస్ రఘు గెలుపు కోసం ప్రచారం చేస్తున్న తమరు పార్టీలోనే అన్ని వర్గాలను కలుపుకొని ఎందుకు ముందుకు పోవడం లేదన్నారు. మిట్ట సామాపురం కాల్వకు సాగునీరు మీ పొలాల కోసం తీసుకున్నవి కాదా అని ఆయన ప్రశ్నించారు. రాజీవ్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలన్న తపనతో తాను కూడా ఎన్నో ప్రయత్నాలు చేసింది గుర్తుంచుకోవాలన్నారు. ఇకపోతే రైతు సంఘం నాయకుడిగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించకపోతే నిరాహార దీక్షకు సిద్ధమవుతానని కూటమి ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఏ. సిరి నియోజకవర్గంలోని నందవరం ఎమ్మిగనూరు మండలాల పేర్లను రెండో జాబితాకు పంపించడం హర్ష నీయమన్నారు.
A. R. శరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా