అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య
సూర్య, లక్షెట్టిపేట/మంచిర్యాల జిల్లా ప్రతినిధి :
అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. లక్షెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్‌కు చెందిన తిప్పని శేఖర్ (28) గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ నెల 23న ఇంట్లో పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి తల్లి వజ్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ తెలిపారు.