BREAKING
ఓట్ల వేటకు"అర్నబ్ "దెబ్బ..బ్రేక్ పడిన అభ్యర్థుల ప్రచారం! * స్తంభించిన స్థానిక సంస్థల ప్రచార పర్వం * అల్పాహార పథకంతో విద్యార్థుల ఆదర్శ శాతం పెరుగుదల మక్కువ.. ఎవరికి ఎక్కువ కాశీలో నివాసం.. ఇల్లు కొంటే వచ్చేది కాదు, శివుడు అనుగ్రహిస్తేనే వస్తుందా? జడ్పిటిసి అభ్యర్థి మతల సౌజన్యను గెలిపించండి జోరు వానలో కూటమి అభ్యర్థుల కోసం ఎమ్మెల్యే సతీమణి అనూష విస్తృత ప్రచారం భర్త డైరెక్షన్‌లో బోల్డ్ సీన్లలో నటించడంపై స్పందించిన నటి జ్యోతి పూర్వజ్.. కల్లర్ మూవీ విశేషాలు కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి కరువు జాబితాలో నవాబుపేటకు చోటేది? రైల్వే లెవల్ క్రాసింగ్ మరమ్మతులు ఆస్కార్ బరిలో నిలిచిన గోంధాల్.. తెలుగులోనూ గ్రాండ్‌గా విడుదల కానున్న ప్రసిద్ధ సైకలాజికల్ థ్రిల్లర్ నారాయణరావుపేట పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై రేపు విచారణ. తీవ్ర తుఫానుకు తల్లడిల్లుతున్న వృద్ధ దంపతులు.. ఎగిరిపోయిన ఇంటి పైకప్పు! 32వ వార్డులో ఫ్యాన్ హోరు - గోల్డ్ ఇస్మాయిల్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు బీజేపీ కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ

డాక్టర్‌ సురేందర్‌నాథ్‌ రెడ్డి విజయ ప్రస్థానం

Select Suryaa Now
డాక్టర్‌ సురేందర్‌నాథ్‌ రెడ్డి విజయ ప్రస్థానం

 

 

వైద్య నిర్ధారణ రంగంలో నాణ్యత, విశ్వసనీయతకు ప్రాధాన్యమిస్తూ డాక్టర్‌ సురేందర్‌నాథ్‌ రెడ్డి సాగిస్తున్న ప్రస్థానం ప్రత్యేక గుర్తింపు పొందింది. 1981లో హైదరాబాద్‌లో ఒకే కేంద్రంతో ప్రారంభమైన విజయ డయాగ్నోస్టిక్స్‌.. నేడు ఏడు రాష్ట్రాల్లోని 30 నగరాల్లో సుమారు 170 కేంద్రాలకు విస్తరించింది. ఏటా కోటి మందికి పైగా వినియోగదారులకు సేవలందిస్తోంది. రోగులకు అవసరమైన వైద్య పరీక్షలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ఈ సంస్థ.. ఆధునిక వైద్య పరికరాలు, నిపుణుల సేవలు, నాణ్యమైన పరీక్షలు, అందుబాటు ధరలతో అభివృద్ధి చెందింది. సంస్థ వృద్ధిలో ఉద్యోగులను భాగస్వాములను చేస్తూ 400 మందికి పైగా ఉద్యోగులకు కంపెనీలో వాటాలు కల్పించడం డాక్టర్‌ రెడ్డి ప్రత్యేకతగా నిలిచింది. వ్యాపార విస్తరణతోపాటు వైద్య రంగంలో కొత్త వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం, బాలికల విద్య, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరించడం ద్వారా సామాజిక బాధ్యతను కూడా కొనసాగిస్తున్నారు. ఒకే కేంద్రంతో మొదలైన ప్రయాణాన్ని దేశవ్యాప్తంగా విస్తరించిన విజయ డయాగ్నోస్టిక్స్‌ ప్రస్థానంలో నాణ్యత, నిబద్ధత, ఉద్యోగుల భాగస్వామ్యం, సామాజిక సేవ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఎ.రవీందర్‌ తెలంగాణ బ్యూరో ప్రతినిధి