BREAKING
స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 46 మంది మృతి సూర్య న్యూస్ కథనానికి స్పందన... పేదల ఇళ్ల పోరాటానికి స్పందించిన అధికారులు రావణాసురుడు పూర్తిగా చెడ్డవాడు కాదు.. రామాయణంపై నటి సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య ఎస్.వి. కళాశాలలో ఘనంగా వాణిజ్యోత్సవం–2కె26.. విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలి.. డాక్టర్‌ సురేందర్‌నాథ్‌ రెడ్డి విజయ ప్రస్థానం నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం.. మూకుత్తి అమ్మన్ 2పై నటి నయనతార భావోద్వేగ వ్యాఖ్యలు యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు రైతులు ప్రాధాన్యమివ్వాలి - మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్మయి ఏ. నారాయణపురం ఎంపీటీసీ 2 కూటమి అభ్యర్థిగా లాలు స్వామి రాయల్ మద్యానికి బానిసై వ్యక్తి మృతి జాతీయ స్థాయి కథల పోటీల్లో వెల్మల్ బొప్పారం విద్యార్థినికి 8వ స్థానం రైతులకు అండగా సీసీఐ కొనుగోలు కేంద్రం.. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి అజిత్ కుమార్ డేర్ డెవిల్ షూటింగ్ అప్‌డేట్.. నటీనటులు మరియు కీలక వివరాలు వెల్లడించిన దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ కూటమి ఎంపీటీసీ అభ్యర్థి రావి చైతన్య కిషోర్ ఎన్నికల ప్రచారం ప్రారంభం ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలిః మంత్రి సీతర్క

*ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో దెబ్బ తిన్న కలెక్టర్ కారు* *కలెక్టర్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం*

Select Suryaa Now
*ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో దెబ్బ తిన్న కలెక్టర్ కారు*  *కలెక్టర్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం*

విజయనగరం, అక్టోబర్ 28, మేజర్ న్యూస్:

అర్నాబ్ తుఫాను నేపథ్యంలో పెద్దగడ్డలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున పారాది వంతెన వద్ద పరిస్థితిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, అనంతరం బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పరిశీలించి విజయనగరం తిరిగి వస్తుండగా బుధవారం భూషాయవలస పెట్రోల్ బంక్ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది.

కలెక్టర్ ప్రయాణిస్తున్న కారును బుషాయవలస పెట్రోల్ బంక్ నుండి ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో కారు ఎడమవైపు పూర్తిగా దెబ్బతింది. అయితే, కలెక్టర్‌తో పాటు కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ కృష్ణ, సీసీ దుర్గాప్రసాద్, గన్‌మన్ రాము, డఫేదార్ రమేష్, సమాచార శాఖ వీడియోగ్రాఫర్ సన్యాసినాయుడుకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ప్రమాదం అనంతరం లారీని ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్‌ను సిబ్బంది వెంబడించారు. రాంభద్రపురం, కొట్టక్కి చెక్‌పోస్టుల వద్ద ఆగకుండా వెళ్లిన లారీ డ్రైవర్, చివరకు పీకోనవలస చెక్‌పోస్టు సమీపంలో వాహనాన్ని వదిలి పరారయ్యాడు. పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.

శ్రీనివాస్ బ్యూరో విజయనగరం