అంబాజీపేటలో ముమ్మర వాహన తనిఖీలు
అంబాజీపేట మేజర్ న్యూస్ :ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో అంబాజీపేట సెంటర్‌లో బుధవారం ఎన్నికల అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు.జిల్లా నోడల్ అధికారి దుండి రాంబాబు ఆధ్వర్యంలో ఎఫ్‌ఎస్‌టీ టీం సభ్యులు సిహెచ్. వెంకటేశ్వరరావు,ఎస్‌ఎస్‌టీ టీం సభ్యులు ఎ. వెంకటకృష్ణ, పోలీస్ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.ఈ నెల 5న జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యా అంబాజీపేట సెంటర్‌లోని ప్రధాన కూడలిలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. ఎన్నికల సమయం మద్యం, డబ్బు పంపిణీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు వాహనదారులను హెచ్చరించారు.