BREAKING
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీ ప్రారంభం విపత్తు నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకం పశుగ్రాస సాగుకు దరఖాస్తుల ఆహ్వానం కొత్తమ్మతల్లి సేవలో ఖాకీలు రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన ఎస్.రాయవరం విద్యార్థినులు! పెనుగొండ వాసవి అమ్మవారి శరన్నవరాత్రులకు ఘన ఏర్పాట్లు ★పది రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనం మానసిక ఆరోగ్యంపై అపోహలు వీడాలి! ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రజా సమస్యల వినతులు స్వీకరణ... బీసీలకు ద్రోహం చేసింది వైసీపీనే! చెన్నైలో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ ఢిల్లీలో సీఈసీపై నిరసనల వేళ.. నీలంకరైలోని నివాసంలో గంటపాటు ఏకాంత చర్చలు. జిల్లా జడ్పీ సీఈఓ గా టి.ఎన్.శోభన్ బాబు 25వ రోజుకు చేరిన వి ఆర్ ఏ ల రిలే నిరాహార దీక్ష పాకలపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం – ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ రేవతమ్మ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన

అమరావతిలో అల్లూరి స్మృతి వనం ఏర్పాటుకు కృషి* -- క్షత్రియ కార్పొరేషన్ అభివృద్ధికి సహకారం -- కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ

Select Suryaa Now
అమరావతిలో అల్లూరి స్మృతి వనం ఏర్పాటుకు కృషి*                              -- క్షత్రియ కార్పొరేషన్ అభివృద్ధికి సహకారం        -- కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ

భీమవరం, మేజర్ న్యూస్ : అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. క్షత్రియ సామాజిక వర్గంలోని నిరుపేదలకు అండగా నిలవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం క్షత్రియ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. భీమవరంలోని కేంద్ర సహాయ మంత్రి క్యాంపు కార్యాలయంలో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను మర్యాదపూర్వకంగా శనివారం కలిసి, కార్పొరేషన్ అభివృద్ధికి సంబంధించి పలు ప్రతిపాదనలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కార్పొరేషన్‌కు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయడం, రిజర్వ్ ఫండ్ కేటాయించడం, రాష్ట్ర రాజధాని అమరావతిలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మృతి వనాన్ని నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించేలా కృషి చేయాలని కోరారు.ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు ఒక సామాజిక వర్గానికో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో పరిమితమైన నాయకుడు కాదని, యావత్ దేశం గర్వించదగ్గ స్వాతంత్ర్య సమరయోధుడని కొనియాడారు. ఆయన త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి భావితరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. భీమవరంలో క్షత్రియ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో అమరావతిలో అల్లూరి సీతారామరాజు స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆయన జీవిత చరిత్ర, దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం, త్యాగాలను భావితరాలకు మరింత చేరువ చేయవచ్చని అభిప్రాయపడ్డారు.అమరావతిలో అల్లూరి స్మృతి వనం ఏర్పాటుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. క్షత్రియ కార్పొరేషన్ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు, రాబోయే ఒకటి రెండు నెలల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో పాటు సంబంధిత అధికారులతో చర్చించి, స్మృతి వనం నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించేలా కృషి చేస్తానని శ్రీనివాస వర్మ తెలిపారు. ఈ సమావేశంలో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లు పేరేచర్ల సుభాష్ రాజు, మంతెన సత్యనారాయణ రాజు, భూపతి రాజు శ్రీకృష్ణ వర్మ ,దంతులూరి జయప్రకాష్ నారాయణ రాజు,  పోతూరి కృష్ణంరాజు, ఇందుకూరి రామకృష్ణంరాజు,నంబూరి రామచంద్రరాజు, డి.సత్యనారాయణ రాజు, ఏకరాజు సత్య హరిహర రాజు తదితరులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా