andhrapradesh
అక్రమ మద్యం విక్రయాల నివారణకు ప్రత్యేక చర్యలు
ముప్పాళ్ళ, రాజుపాలెం మండలాల్లో ఇద్దరు వ్యక్తులను బైండోవర్
సత్తెనపల్లి న్యూస్ : ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం విక్రయాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సత్తెనపల్లి ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ పి. విజయ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని బి ఎన్ ఎస్ సెక్షన్ 129(జి ) ప్రకారం ముప్పాళ్ళ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారి కోర్టులో బైండోవర్ చేశామన్నారు .అలాగే రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని ఎన్ ఎస్ సెక్షన్ 128 ప్రకారం రాజుపాలెం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారి కోర్టులో బైండోవర్ చేయడం జరిగిందన్నారు. అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు ముందస్తు నివారణ చర్యలు కొనసాగిస్తున్నామని, అక్రమ మద్యం కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ పి. విజయ్ కుమార్ తెలిపారు.