అద్దంకిలో రెండవ రోజు ఉత్కంఠభరితంగా నామినేషన్ల ప్రక్రియ.
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకి పురపాలక సంఘం ఎన్నికలకు సంబంధించి రెండవ రోజు నామినేషన్ల ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నామినేషన్ల పర్వం విజయవంతంగా జరిగినట్లు కమిషనర్ రవీంద్ర తెలిపారు.
చైర్పర్సన్ స్థానానికి మొత్తం 5 నామినేషన్లు దాఖలు కాగా, అందులో టీడీపీ తరపున 2 మరియు వైఎస్సార్సీపీ తరపున 3 నామినేషన్లు స్వీకరించినట్లు ఆయన వెల్లడించారు. అలాగే, 32 వార్డులకు సంబంధించి మొత్తం 37 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో టీడీపీకి 10, వైఎస్సార్సీపీకి 25, జనసేనకు 2 చొప్పున నామినేషన్లు వచ్చాయని తెలిపారు. రేపు కూడా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ కొనసాగుతుందని, రేపు మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల స్వీకరణ పూర్తిగా ముగుస్తుందని సహాయ ఎన్నికల అధికారి, కమిషనర్ రవీంద్ర స్పష్టం చేశారు.