ఆదివారం సెలవు అయినా మానవత్వానికి మరో నిదర్శనం – పోలవరం ఎమ్మెల్యే చిర్రి
ఆదివారం సెలవు అయినా జీలుగుమిల్లి సూర్య న్యూస్: టీ నర్సాపురం మండలం, అప్పల రాజుగూడెం గ్రామానికి చెందిన నంబూరి కృష్ణ ప్రమాదానికి గురై అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ 8,07000 లక్షలు మంజూరు చేయించి చెక్కు అందించి ఆదుకున్న పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు కు బాధితుల కృతజ్ఞతలు తెలిపారు. అప్పలరాజు గూడెం టిడిపి నాయకులు గన్నినసురేంద్రనాథ్ చౌదరి, దర్బగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులు తమ్మినసాంబ ఆపదలో ఉన్న విషయాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి తీసుకెళ్లడం తో తక్షణ మే స్పందించిన ఎమ్మెల్యే బాలరాజు ఆదివారం సెలవు కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో లేకపోయినా ఎమ్మెల్యే స్వయంగా దగ్గరుండి ఎల్ ఓ సి 8,07,000 ఎనిమిది లక్షల ఏడు వేల రూపాయలు మంజూరు చేయించినట్లు బాధితులు పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ పేద కుటుంబాలకు వైద్య సహాయం అందేలా కృషి చేస్తున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
రిపోర్టర్ బంతు రామకృష్ణ జీలుగుమిల్లి ఏలూరు జిల్లా,