ఆధ్యాత్మిక ఉన్నతత్వానికి ప్రతీకలు మన దేవాలయాలు పాలకమండలి సభ్యులు దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలి :ఎమ్మెల్యే బండారు
కట్టుంగ శ్రీ పార్వతీ సమేత సఖిలేశ్వర స్వామి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే బండారు
ఆత్రేయపురం మేజర్ న్యూస్ పవిత్ర గోదావరి నది తీరం ఎన్నో మహోన్నతమైన ఆలయాలకు ప్రఖ్యాతి చెందిందని, మన భారతీయ ఆధ్యాత్మిక ఉన్నతత్వానికి మన దేవాలయాలు ప్రతీకలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ఆదివారం జరిగిన కట్టుంగ శ్రీ శ్రీ శ్రీ పార్వతీ సమేత సఖిలేశ్వర స్వామి వారి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు పాలకమండలి చైర్మన్, సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు.
నూతన పాలకమండలి దేవాలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని సూచించారు. రానున్న పుష్కరాల నేపథ్యంలో గోదావరి తీరంలోని ఆలయాలకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, అటువంటి సందర్భంలో పాలకమండలి చైర్మన్, సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు
ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లి మంగాదేవి మండల టిడిపి అధ్యక్షులు కూసం పూడి రామకృష్ణంరాజు రాష్ట్ర టి ఎన్ టి యు సి కార్యనిర్వహక కార్యదర్శి ముల్లపూడి భాస్కరరావు జిల్లా ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షులు కరుటూరి నరసింహారావు దొడ్డపనేని త్రినాధ రావు వెంకట్రావు పాలంగి రవిచంద్ర మద్దింశెట్టి వీర వెంకట సత్యనారాయణ మెర్ల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు